RGV : ఏపీ రాజకీయ నేతలు త్వరలో అలా చేయబోతున్నారట ! ఇదే ఆర్జీవీ జోస్యం

బాక్సింగ్, కరాటే, కర్రసాము వంటివి ఏపీ నేతలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది ఆర్జీవీ తేల్చారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

FOLLOW US: 

రామ్ గోపాల్ వర్మకు రాజకీయాలంటే చాలా ఆసక్తి . ఆయన ప్రతి రోజూ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఉంటారు. తన మైండ్‌సెట్‌కు తగ్గట్లుగా ఏవైనా ఘటనలు జరిగితే తక్షణం స్పందిస్తారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న దాడుల రాజకీయాలపైనా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు ఇక నుంచి బాక్సింగ్, కరాటే, కర్ర సాము వంటివి నేర్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయని తేల్చేశారు. ఆయన అలా ఎందుకన్నారో  అందరికీ తెలుసు.

Also Read : పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు

సాధారణంగా వయోలెన్స్‌ను ఇష్టపడే ఆర్జీవి.. రెండు రోజుల కిందట ఏపీలో జరిగిన పరిణామాలు బాగా ఆసక్తికరంగా కనిపించి ఉంటాయి. సీసీ కెమెరాల్లో చూసిన దృశ్యాలు ఆయనను ఆకర్షించినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంత మంది సుత్తులతో కార్యాలయ సిబ్బందిని మోదడం, కర్రలు, పలుగులతో ధ్వంసం చేయడం.. పెద్ద పెద్ద బండరాళ్ల కార్ల అద్దాలను పగుల గొట్టడం వంటివన్నీ చూసి ఇంతటితో ఆగవని.. ఆయన నిర్ధారించేసుకున్నారు. ప్రతీకారంగా ఇతర పార్టీల నేతలు కూడా చేస్తారు కాబట్టి అందరూ బాక్సింక్, కరాటే, కర్రసాము నేర్చుకుంటారని చెబుతున్నారు. 

Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ? 

ఆర్జీవీ పెట్టిన ఈ కామెంట్‌ను నెటిజన్లు  భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్జీవీకి మరో స్టోరీ దొరికేసిందని సలహాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. ముందుగా ఆర్జీవీ సినిమా తీస్తున్నానని ప్రకటన చేసేస్తూంటారు. తర్వాత పోస్టర్ రిలీజ్ చేస్తూంటారు. అయితే అలాంటి సినిమాలు చాలా వరకు తెరకు ఎక్కవు. అందుకే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

Also Read : ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది.. కాన్వాయ్ తీసేసి తిరుగుతా, లోకేశ్ దమ్ముంటే రా.. మంత్రి అనిల్ సవాల్

ఎవరేమనుకున్నా ఆర్జీవీ మాత్రం తన స్పందనలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూనే ఉంటారు. నెటిజన్లు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను అడ్డుకుంటున్నారంటూ ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించిన ఆయన చేసిన ట్వీట్ కూడా వైరల్‌గా మారింది. 

Also Read : సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Oct 2021 02:06 PM (IST) Tags: ANDHRA PRADESH tdp Ram Gopal Varma AP Politics RGV tweet YSRCP 

సంబంధిత కథనాలు

YSRCP MP Raghurama: నన్ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు,  ప్రధాని మోదీని నేరుగా సాయం కోరతా : ఎంపీ రఘురామ

YSRCP MP Raghurama: నన్ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు, ప్రధాని మోదీని నేరుగా సాయం కోరతా : ఎంపీ రఘురామ

Petrol-Diesel Price, 29 June: గుడ్‌న్యూస్! నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు - మీ నగరంలో ఇలా

Petrol-Diesel Price, 29 June: గుడ్‌న్యూస్! నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు - మీ నగరంలో ఇలా

Weather Updates: రెయిన్ అలర్ట్ - ఏపీలో అక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో ఆ ప్రాంతాలకు IMD వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: రెయిన్ అలర్ట్ - ఏపీలో అక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో ఆ ప్రాంతాలకు IMD వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ

Gold-Silver Price: నేడు బంగారం ధరలో కాస్త ఊరట! వెండి మాత్రం గుడ్ న్యూస్ - మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ

Gold-Silver Price: నేడు బంగారం ధరలో కాస్త ఊరట! వెండి మాత్రం గుడ్ న్యూస్ - మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ

IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు

IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు

టాప్ స్టోరీస్

Slice App Fact Check: స్లైస్ యాప్‌ యూజర్ల డేటా సేకరిస్తోందా - అన్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Slice App Fact Check: స్లైస్ యాప్‌ యూజర్ల డేటా సేకరిస్తోందా - అన్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Naga Babu's Name Tattooed: కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు

Naga Babu's Name Tattooed: కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

TCSలో ఉద్యోగానికి, గవర్నమెంట్ జాబ్‌కు పెద్ద తేడా లేదట, ఎందుకంటే..

TCSలో ఉద్యోగానికి, గవర్నమెంట్ జాబ్‌కు పెద్ద తేడా లేదట, ఎందుకంటే..