X

AP Govt OTS : "సంపూర్ణ గృహహక్కు" తో పేద ప్రజలకు లక్షల ఆస్తి .. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే ! ఓటీఎస్‌ పథకంపై పూర్తి డీటైల్స్ ఇవిగో..

వన్ టైం సెటిల్మెంట్ పథకంతో పేద ప్రజలకు లక్షల ఆస్తి దక్కుతుంది. కానీ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

FOLLOW US: 


ఆంధ్రప్రదేశ్‌లో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై పూర్తి వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. పేద ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పథకం ఉద్దేశం ప్రజలకు లక్షల విలువైన ఆస్తిని సొంతం చేయడమే. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ ఓటీఎస్ పథకం కొత్తదేమీ కాదు. రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు అమలు చేస్తున్నవే. 

2000 నుంచి అమల్లోకి "ఓటీఎస్" స్కీమ్ !

వన్‌ టైం సెటిల్‌ స్కీం జనవరి 2000లో ప్రారంభమైంది. ఈ స్కీం కింద ప్రభుత్వం వడ్డీ మాఫీ మాత్రమే ఇచ్చేది. రుణం చెల్లించిన తర్వాత తనఖా పెట్టుకున్న పత్రాన్ని తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేవారు.  2014 వరకు అంటే  14 సంవత్సరాల కాలంలో 2,31,284 మంది వన్‌టైం సెటిల్‌ మెంట్‌ స్కీంను వినియోగించుకున్నారు. ఏపీలో మొత్తంగా ఇళ్ల లబ్దిదారుల సంఖ్య 56,69,000.  

Also Read : నెల్లూరు పర్యటనకు సీఎం జగన్.. స్థానిక నాయకుల్లో టెన్షన్ టెన్షన్..

ఓటీఎస్ స్కీమ్‌ను అమలు చేయకుండా పక్కన పెట్టేసిన గత ప్రభుత్వం ! 

దాదాపుగా 14 ఏళ్ల పాటు సాగిన ఓటీఎస్ స్కీమ్‌ను గత ప్రభుత్వం నిలిపివేసింది. 2014 ఏప్రిల్‌ నుంచి 2019 వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు 2016లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంను పొడగించమని ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత కూడా 2019 వరకు ఐదు సార్లు బోర్డు మీటింగ్‌లు జరిగాయి. ప్రతీ సారి ఓటీఎస్ స్కీమ్‌ అమలు కోసం ప్రతిపాదనలు పంపారు. కానీ అప్పటి ప్రభుత్వం అమలు చేయలేదు.  2014-19 మధ్యలో ఒక్కరికి కూడా రుణం కానీ వడ్డీ కానీ మాఫీ జరగలేదు.  

Also Read : ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !

పేదలకు ఇళ్లపై హక్కులు కల్పించాలని సీఎం జగన్ లక్ష్యం !

ఇప్పటి వరకూ పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ముకునే హక్కు లేదు.  కానీ జగన్ అమ్ముకునేందుకు  వారసులకు బహుమతిగా ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అందుకే  సంపూర్ణ గృహహక్కు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూములు (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) చట్టం 1977 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. 15 ఆగష్టు 2011 కంటే ముందు ఇచ్చిన నివేశన పత్రాలు కానీ, డీఫామ్ పట్టాలు కింద ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఈ పథకంలో లబ్ధిపొందుతారు.  ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 లో కూడా సవరణలు తీసుకువచ్చారు. 

Also Read : ఓటీఎస్ పథకం స్వచ్చందమే.. టీడీపీ కుట్ర చేస్తోందన్న మంత్రి బొత్స !

పరిమిత మొత్తంలో చెల్లింపు - పూర్తి రుణం మాఫీ ! 

హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సుమారు 40 లక్షల మంది రుణం తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు.  రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా లబ్ధిదారులకి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20 వేలుతో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్ణయించిన మొత్తం కంటే వాళ్ల కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లించి ఈ పథకానికి అర్హులు కావచ్చు. నిర్ణయించిన మొత్తం కంటే కట్టవలసిన సొమ్ము ఎక్కువగా ఉంటే.. నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువగా ఉన్న మొత్తం పూర్తిగా మాఫీ ;smdlejg. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో ఒక లబ్ధిదారుడు రూ.9వేలు రుణభారం ఉందనుకుంటే  సదరు లబ్ధిదారుడు రూ.10వేలకు బదులు రూ.9 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే మరో లబ్దిదారుడు రూ.50,000  రుణం చెల్లించాల్సి ఉందనుకుంటే.. ఆ లబ్ధిదారుడు రూ.10వేలు కడితే అతడికి రూ.40,000 మాఫీ అవుతుంది. సుమారు 12 లక్షల మంది హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏ విధమైన రుణం తీసుకోకుండా ఇళ్లు కట్టుకున్నారు. వాళ్లందరికీ రూ.10 నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు వాళ్ల పేరుమీదే, వాళ్ల ఇంటికి సంబంధించిన నివేశన స్ధలానికి ఇస్తారు. 

Also Read : ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?

గతం కన్నా భిన్నం.. ఇప్పుడు అమ్ముకోవచ్చు కూడా ! 

గతంలో అమలైన ఓటీఎస్‌ స్కీంలో నిర్ణయించిన మొత్తాన్ని కట్టిన వారికి, తాకట్టు పెట్టిన నివాసిత స్ధలపత్రం కానీ, డీఫామ్‌ పట్టా కానీ తిరిగి ఇవ్వబడేది. ఏ విధమైన అమ్ముకునే హక్కు కానీ, వారసులుకు బహుమతిగా రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు కానీ లభించేది కాదు. సంపూర్ణ గృహహక్కుపథకంలో లబ్ధిదారుడికి వాళ్ల ఇళ్లపై సర్వహక్కులు ఉంటాయి. అమ్మకోవడానికి, బహుమతిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రభుత్వమే వారి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుంది. భవిష్యత్తులో ఏ విధమైన ఇతర లింకు డాక్యుమెంట్లు అవసరం లేకుండా, ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్డ్‌ డాక్యుమెంటుతో అమ్ముకుని నేరుగా  రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.   లబ్ధిదారుడికిచ్చే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేసి డిసెంబరు 21 తర్వాత సచివాలయంలోనే అందజేస్తారు. 

Also Read : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?

బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి ! 

ఇంతకముందున్న ఓటీఎస్‌ స్కీంలో నివేసిత పత్రంమీద కానీ, డీఫామ్‌ పట్టాల మీద గానీ బ్యాంకులు రుణసదుపాయం కల్పించేవి కావు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ మీద భూమి మరియు ఇంటి విలువ మీద 75 శాతం వరకు కూడా బ్యాంకులు రుణ సదుపాయం కల్పించనున్నాయి. స్ధలం విలువ రూ.6 లక్షలు అనుకుంటే, ఇంటి విలువ రూ.2లక్షలు అనుకుంటే బ్యాంకులు 75 శాతం వరకు రుణం అంటే రూ.6 లక్షలు వరకు లోన్‌ సదుపాయం ఉంటుంది.  కార్పొరేషన్‌లో స్ధలం విలువ  రూ.12 నుంచి 15 లక్షలు అనుకుంటే ఇంటి విలువ రూ. 1 నుంచి 3 లక్షలు అనుకుంటే అతనికి 75 శాతం రుణం అంటే రూ. 8 లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు కొత్తగా రుణం పొందే సౌకర్యం ఉంటుంది. 

Also Read : ఏపీకి వరద సాయం రూ.895 కోట్లిచ్చాం .. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి ఆన్సర్ !

రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ !

మామూలుగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ. లక్ష అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. ఈ పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులను రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వహిస్తున్న నిషేధిత జాబితా 22ఏ నుంచి తొలగిస్తారు. అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రెవెన్యూశాఖ నుంచి ఏ విధమైన నిరభ్యంతర పత్రం అవసరం ఉండదు. ఇప్పటికే 1 లక్షా 6 వేల మంది  ఉపయోగించుకున్నారు.  ప్రతి రోజూ దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. 

Also Read : ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసులు.. డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక ఉద్యమమే..!

పేద ప్రజలకు మేలు జరగకుండా టీడీపీ కుట్ర చేస్తోందన్న బొత్స ! 

పేద ప్రజలకు ఇంత మేలును ఏపీ ప్రభుత్వం చేస్తూంటే.. వారికి ఎలాంటి మేలు జరగకుండా టీడీపీ చేస్తోందని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ హయాంలో సంవత్సరానికి కనీసం 9 వేలమందికి కూడా లబ్ధి చేకూర్చలేకపోయారని కానీ ఇప్పుడు మాత్రం తాము అధికారంలోకి వస్తే పూర్తిగా మాఫీ చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ అని ఏ రకంగా రైతులను వంచించారో ఇప్పుడు పేదల్ని అలాగే వంచిస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారని మ్యానిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించారని విమర్శించారు.  

Also Read : ఏపీ అప్పులపై ప్రధాని జోక్యం చేసుకోవాలి.. లోక్‌సభలో రఘురామ విజ్ఞప్తి !

పథకాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం !

ఓటీఎస్‌ పథకం పూర్తిగా స్వచ్ఛందం. ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఏ విధంగానైనా అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. గ్రామ స్ధాయిలో ఎక్కడో ఒక చోట ఒక పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇచ్చిన ఆదేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేసి..  ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే చర్యలో భాగంగానే మీరు చేయిస్తున్న కుట్రలని మండిపడ్డారు. అప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని ఆపారు. .ఇప్పుడు రుణ సదుపాయం పొందిన వారికి వాళ్ల ఇళ్లపై సంపూర్ణ హక్కులను కూడా పొందనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బొత్స ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు.  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: ANDHRA PRADESH cm jagan minister botsa One Time Settlement Scheme OTS Absolute Housing Scheme

సంబంధిత కథనాలు

Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...

Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...

Gudivada Casino : ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !

Gudivada Casino :  ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !

Breaking News Live: గచ్చిబౌలిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి.. 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Breaking News Live: గచ్చిబౌలిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి.. 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Bridge Collapse In Nellore: ప్రమాదం దాటితేనే కడుపు నిండేది.. చదువు వచ్చేది

Bridge Collapse In Nellore: ప్రమాదం దాటితేనే కడుపు నిండేది.. చదువు  వచ్చేది

Kurnool జిల్లాలో నాటు బాంబుల కలకలం.. పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Kurnool జిల్లాలో నాటు బాంబుల కలకలం.. పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి