AP Funds : కష్టాల్లో ఏపీని ఆదుకున్న కేంద్రం.. భారీగా లోటు భర్తీ నిధుల విడుదల!
ఏపీకి రెవిన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లు ప్రభుత్వానికి విడుదల చేసింది. రుణంగా తీసుకున్న రూ. రెండు వేల కోట్లను ఆర్బీఐ ఓడీ కింద జమ చేసుకోవడంతో ఈ నిధులు ప్రభుత్వానికి రిలీఫ్ ఇవ్వనున్నాయి.
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఊరటనిచ్చింది. రెవెన్యూ లోటు భర్తీ కిద ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేసినట్లు కేంద్రం ఆర్థిక శాఖ తెలిపింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ లోటు బడ్జెట్‌లోకి వెళ్లిపోయింది. లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు కేటాయిస్తూ ఉంటారు. ఈ మేరకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు లోటు భర్తీకి నిధులు విడుదల చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా కాకుండా అదనంగా 2021 -22లో రూ.17,257 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూ.8,628.50 ఇచ్చేసింది. Also Read : రోజంతా లోకేష్ టూర్ హైవోల్టేజ్ టెన్షన్ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లలో ఉంది. మంగళవారం ఆర్బీఐ వద్ద రూ. రెండు వేల కోట్లను రుణంగా తీసుకుంటే అదంతా ఓవర్ డ్రాఫ్ట్ కింద జమ చేసుకుంది. ఇలాంటి సమయంలో అవసరాలు తీరడానికి, పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు, ఇతర బిల్లుల చెల్లింపుల కోసం నిధులు అవసరం అయ్యాయి. ఇలాంటి సమయంలో కేంద్రం లోటు భర్తీ నిధులు విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వానికి కాస్త రిలీఫ్ వచ్చినట్లయింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కువ రోజులు ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఉన్నతాధికారులందర్నీ కలుస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రుణ పరిమితిని పెంచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ కారుణంగా రూ. 10500 కోట్లు డిసెంబర్ వరకూ అదనపు రుణం తీసుకోవడానికి అవకాశం లభించింది. Also Read : జగన్‌కు మాత్రమే ఓదార్పు చేసే హక్కు ఉందా ?
ఈ మొత్తాన్ని ప్రతీ మంగళవారం ఆర్బీఐ వంద బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం సేకరించుకునే అవకాశం ఉంది. మరో వైపు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధుల సమీకరణ చేస్తోంది. వాటి ద్వారా సేకరిస్తున్న రుణాలను సంక్షేమ పథకాలకు మళ్లిస్తోంది. ఈ అంశంపై ఎన్ని వివాదాలు వచ్చినా ప్రజలను కాపాడుకోవడానికే అప్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వారివి తప్పుడు ఆరోపణలేనని ప్రభుత్వం కొట్టి పారేస్తోంది.Also Read : ఏపీ ప్రభుత్వ టిక్కెట్ల విధానంపై స్పందించని టాలీవుడ్
కేంద్రం నుంచి విభజన హామీల కింద నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఇవ్వాలని రాష్ట్రం పట్టుబడుతోంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు కూడా ఇవ్వాల్సి ఉంది. వాటిని కూడా కేంద్రం విడుదల చేస్తే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు మరింత తగ్గే అవకాశం ఉంది.