News
News
X

Three Capitals : మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?

ఏపీ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది.  మూడు రాజధానుల బిల్లులు,  సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆచరణ ఆగిపోయింది. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అవుతోంది. 

Also Read: YS Jagan : వరద విపత్తును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొలేకపోయిందా ? సీఎం జగన్ తీరుపైనా విమర్శలు ఎందుకు ?

అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఆ తర్వాత మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. మంత్రులు ఆమోదించారు. ఈ విషయాన్ని  హైకోర్టులో మూడు రాధానులపై విచారణ జరుగుతున్న సందర్భంలో ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ వివరించారు.  న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు స్పందన తెలియాల్సి ఉంది. 

Also Read: Nellore Mayor Election: నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా పొట్లూరి స్రవంతి..

మూడు రాజధానుల బిల్లులు మొదటగా అసెంబ్లీలో పాసై మండలికి వచ్చాయి. అప్పట్లో మండలిలో  ఆమోదం పొందలేదు. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. అయితే అనూహ్యంగా తర్వాత జరిగిన సమావేశాల్లో మరోసారి ఏపీ ప్రభుత్వం అవే బిల్లులను ప్రశవ పెట్టింది. అసెంబ్లీలో ఆమోదించింది. కానీ మళ్లీ మండలిలో ఆమోదం పొందలేదు. కానీ రెండు వారాల గడువు తర్వాత మండలి ఆమోదం కూడా అవసరం లేదని పాసయినట్లేనని చెప్పుకున్న ప్రభుత్వం బిల్లులను గవర్నర్‌కు పంపింది. ఆయన ఆమోద ముద్రవేశారు. ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. కానీ రైతులు మాత్రం చట్ట విరుద్ధంగా బిల్లులు ఆమోదించారని కోర్టుకు వెళ్లారు. 

Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు

మూడు  రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లుగా కాదని.. మరో రూపంలో తెర మందుకు తెస్తారని భావిస్తున్నారు. కోర్టుల్లో ఆ బిల్లులు నిలబడవన్న కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏ రూపంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: చంద్రబాబుకు సోనూసూద్ పరామర్శ... అసెంబ్లీ పరిణామాలపై విచారం వ్యక్తం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 11:51 AM (IST) Tags: ANDHRA PRADESH cm jagan AP government ap high court Three Capitals Bill CRDA Abolition Bill

సంబంధిత కథనాలు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Supreme Court On AP Govt : లాయర్లకు ఫీజుల చెల్లింపులో ఉన్న శ్రద్ధ పర్యావరణ రక్షణపై లేదా?, ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court On AP Govt : లాయర్లకు ఫీజుల చెల్లింపులో ఉన్న శ్రద్ధ పర్యావరణ రక్షణపై లేదా?, ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కళ్యాణమస్తు పథకంలో టెన్త్‌ తప్పనిసరి రూల్‌ అందుకే పెట్టాం: సీఎం జగన్

కళ్యాణమస్తు పథకంలో టెన్త్‌ తప్పనిసరి రూల్‌ అందుకే పెట్టాం: సీఎం జగన్

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

టాప్ స్టోరీస్

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam