అన్వేషించండి

TDP News: మరో 3 నెలల్లో అధికారంలోకి టీడీపీ, ప్రజా రాజధాని నిర్మిస్తాం: పరిటాల సునీత

AP Capital Amaravati: రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, మరో 3 నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని పరిటాల సునీత స్పష్టం చేశారు. 

TDP leader Paritala Sunitha: అనంతపురం: ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) పాలనలో అన్ని వర్గాలవారు ఇబ్బంది పడినప్పటికీ ఎక్కువగా నష్టపోయింది రైతులేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ నాలుగేళ్ల 9 నెలల పాటు వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కనీసం ఏ ప్రాంతంలో కూడా మంచి పంటలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదన్నారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఏది అంటే రాష్ట్ర ప్రజలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొరని, రాజధాని అమరావతి (AP Capital Amaravati)ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి, ప్రజా రాజధానిని నిర్మించి తీరుతుందని ఆమె స్పష్టం చేశారు. 

వైసీపీ నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా వారికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని ఇప్పటికే ఎమ్మెల్యేలంతా పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని 2024లో వైసీపీ కనుమరుగు అవడం ఖాయమన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చే 15వేల రూపాయలతోనే మొత్తం అంతా ఏదో ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
వర్షాలు కురిసినా సాగుకు నీళ్లందించలేదు..
అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ రైతులు పంటలు నష్టపోయారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో పాటు వ్యవసాయానికి, సాగుకు సంబంధించి సరైన నిధులు కేటాయించకుండా ద్రోహం చేశారన్నారు. ఫలితంగా నాలుగేళ్ల పాటు వర్షాలు కురిసినా.. నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా చెల్లించలేదని సీఎం జగన్ పై పరిటాల సునీత విమర్శలు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు ప్రాజెక్టుకు వర్షాల వల్ల నీళ్లు వస్తే దానిని పంటలకు ఇవ్వలేకపోయిన చేతగాని సర్కార్ వైసీపీ ప్రభుత్వం అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
కనీసం చెప్పుకోదగ్గ విధంగా అనంతపురం జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. మరోవైపు నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాప్తాడు విషయానికొస్తే వచ్చిన జాకీ పరిశ్రమను కూడా వెళ్లగొట్టారని పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు కారణంగా కియా పరిశ్రమ కూడా ఒకానొక దశలో వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్ని, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఇలా అన్ని వర్గాల వారిని రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. 
నవరత్నాల సాకుతో అన్ని రకాలుగా దోపిడీ
విద్యుత్ ఛార్జీలు, పన్నులు పేరుతో ప్రజల రక్తాన్ని జగన్ పీల్చివేశారంటూ మండిపడ్డారు. కేవలం నవరత్నాలు అన్న సాకు చూపి ప్రజలను ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో చేసింది ఏమీ లేకపోయినా ప్రజల భూముల్లో జగన్ బొమ్మలు వేయడం.. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడం మాత్రమే చేశారని ప్రజలు గుర్తించినట్లు చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget