TDP Dhulipalla : సీఎం జగన్ ప్యాలెస్‌లన్నీ బీనామీల పేర్ల మీదే - టీడీపీ సంచలన ఆరోపణలు !
జగన్ ఇళ్లు అన్ని ఎవరి పేరు మీద ఉన్నాయో వెల్లడించాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. జగన్ ఇళ్లన్నీ బినామీల పేర్ల మీదనే ఉన్నాయన్నారు.
TDP Dhulipalla : చంద్రబాబు అద్దె ఇంటిని క్విడ్ ప్రో కో పేరుతో ప్రభుత్వం జప్తు చేయడంపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు , ఆయన ఉంటున్న ఇల్లు తప్ప జగన్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలేవీ పట్టట్లేదని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు చంద్రబాబుదని, ఉండవల్లిలో ఉంటోంది అద్దెకుంటున్న ఇల్లని తాము ధైర్యంగా చెప్పగలమని అన్నారు. ఉండవల్లి లో ఉంటోంది అద్దె ఇల్లు కాబట్టే చంద్రబాబు దానికి డబ్బులు చెల్లిస్తున్నారన్నారని స్పష్టం చేశారు.
అన్ని పార్టీల్నీ పొగుడుతున్న జేడీ లక్ష్మినారాయణ - సీటు కోసమే ప్రయత్నలా ?
బెంగుళూరు, తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్‌లలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి పేరు మీద లేదా భారతీ రెడ్డి పేరు మీద ఉన్నాయా అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఎవరి పేరు మీద ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకోల ద్వారా వచ్చిన ప్యాలెస్‌లు కాబట్టే సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. క్యాంప్ క్లర్క్ సజ్జల నటన ఎస్వీ రంగారావుని మించిపోయిందని ఎద్దేవా చేశారు. అధికారం తమ చేతిలో పెట్టుకుని, ప్రభుత్వ నివాసమా? లేక ప్రయివేటు నివాసమా? అని అడగటం విడ్డూరంగా ఉందని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు. కాగితాల మీద ప్రతిపాదనలకే పరిమితమై ఉన్నఇన్నర్ రింగ్ రోడ్‌పై తెలుగుదేశం ప్రభుత్వం అభ్యంతరాలు కోరితే, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి నిద్రపోయారా? అని ప్రశ్నించారు.
ఒక్క అభ్యంతరం కూడా ఆళ్ల నుంచి ఎందుకు రాలేదన్నారు. ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఉంటున్న ఇంటిని తన అధికారిక నివాసంగా గుర్తించామలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా గుర్తించలేదన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్‌ను సకల సౌకర్యాలతో టీడీపీ ప్రభుత్వం కల్పించిన గౌరవం మరిచారా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబుని ఏదో రకంగా రోడ్డు మీదకు నెట్టాలనే కుట్రలో భాగమే అటాచ్‌మెంట్ డ్రామా? అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు ప్రజల కోసం బస్సులోనే గడిపిన సందర్భాలు అనేకమని గుర్తు చేశారు.
అధికారంలో ఉంటే అమరావతిలో లేకుంటే జూబ్లీహిల్స్‌లో- టీడీపీ, చంద్రబాబు వెంటిలేటర్‌పై ఉన్నారు: జగన్
సీఎం జగన్ విలాసవంతమైన భవనాలు, సౌకర్యవంతమైన ప్రయాణాలు కోరుకుంటారని చంద్రబాబు ఎప్పుడూ కోరుకోలేదన్నారు. సీఐడీ కూడా జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలా పని చేయటం దుర్మార్గమని, సీఐడీని ఇంత విచ్చలవిడిగా గతంలో ఏ ప్రభుత్వమూ వాడలేదన్నారు. జీవో1 ను హైకోర్టు కొట్టివేయటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి... కొత్తగా ఇంటి అంశాన్ని తెరపైకి తెచ్చారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.