(Source: ECI/ABP News/ABP Majha)
JD Laxminarayana : అన్ని పార్టీల్నీ పొగుడుతున్న జేడీ లక్ష్మినారాయణ - సీటు కోసమే ప్రయత్నలా ?
జేడీ లక్ష్మినారాయణ రాజకీయ పయనం ఎటు వైపు ? అన్ని పార్టీల నేతలనూ పొగుడుతూ ఆయన చేస్తున్న ప్రకటనలు రకరకాల చర్చలకు కారణం అవుతున్నాయి
JD Laxminarayana : సీబీఐ మాజీ జేడీ, మాజీ జనసేన నేత వీవీ లక్ష్మినారాయణ రాజకీయం భిన్నంగా సాగుతోంది. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేరు. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయమని చెబుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం తర్వాత చెబుతానని అంటున్నారు. ఏ పార్టీలో కుదరకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంటున్నారు. ఇటీవల విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అందుకే ఆయన సోషల్ మీడియా ప్రకటనలు తరచూ భిన్న చర్చలకు కారణం అవుతున్నాయి.
తాజాగా చంద్రబాబునాయుడు విజన్ ను అభినందిస్తూ.. పెద్ద నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు తాజాగా చేసిన సూచనలకు మద్దతిచ్చారు.
ఆర్థిక నేరాలు , ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీని తగ్గించడానికి రూ. 500 & రూ. 2000 నోట్ల రద్దు చెయ్యాలి అంటూ @ncbn చేసిన సూచనను స్వాగతించాలి. తక్షణమే ఎన్నికల సంస్కరణల్లో భాగంగా నేను సూచించిన విధంగా Rs. 2000 నోటును వెంటనే రద్దు చెయ్యాలి. ఆర్బీఐ కూడా దీన్ని సిఫారసు చేయాలి.
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) May 15, 2023
జేడీ లక్ష్మినారాయణ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. టీడీపీలో చేరుతారా అన్న చర్చ ప్రారంభణయింది. అయితే ఇంతకు ముందే చుక్కల భూముల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని జగన్ నూ ప్రశంసించారు. అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. వైసీపీలో చేరుతారా అని చెప్పుకున్నారు.
[
Thanks to AP Government for clearing the long pending dotted lines issue . Hope the landowners get the required corrected land documents soon. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు AP ప్రభుత్వానికి ధన్యవాదాలు. భూయజమానులకు అవసరమైన సరిచేసిన భూపత్రాలు…
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) May 13, 2023
అంతకు ముందు స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు బీఆర్ఎస్ చీఫ్ పైనా ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్ లో చేరే విషయంలో చర్చలు జరిగాయని అప్పటికే ప్రచారం జరగడంతో ఇక బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అనుకున్నారు.
అకాల వర్షాలు అన్నదాతను మరోసారి దెబ్బతీసాయి. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీయార్ భరోసా ఇవ్వడం హర్షణీయం. దీన్ని, ధాన్యం కళ్ళాల స్థాయి వరకు కమిట్ మెంట్ తో తీసుకెళ్ళే బాధ్యత నేతలు, అధికార యంత్రాంగంపై ఉంది. ప్రకృతి వైపరీత్యాలపై తెలంగాణా…
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) May 3, 2023
కానీ అన్ని పార్టీలనూ లక్ష్మినారాయణ పొగుడుతున్నారు కానీ..ఎవర్నీ విమర్శించడం లేదు. పవన్ కల్యాణ్ సినిమాలు చేయనని చెప్పారని.. పార్టీని వదిలేసి సినిమాలు చేస్తున్నందున తాను జనసేనకు రాజీనామా చేశానని గతంలో ప్రకటించారు.. ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ .. అన్ని పార్టీల నేతల్నీ ఆయన పొగుడుతున్నారు. ఆయన తెలివిగా రాజకీయం చేస్తున్నారని కొంత మంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.