By: ABP Desam | Updated at : 04 May 2023 04:59 PM (IST)
ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా - టీడీపీ నేతల సంతోషం ! ఎందుకంటే ?
Ajay Banga TDP : భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఒక భారతీయ అమెరికన్, సిక్కు అమెరికన్ ప్రపంచ బ్యాంక్‌కు సారథ్యం వహించడం చరిత్రలో ఇదే ప్రథమం. మే 2వ తేదీన బంగా ప్రపంచ బ్యాంక్ సారథిగా పగ్గాలు చేపడతారు. అప్పటి నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సమావేశమై అజయ్ బంగాను అత్యున్నత పదవికి ఎంపిక చేశారు. చరిత్రలో అత్యంత కీలకమైన ఈ సమయంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హుడుగా భావించిన బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు.
సంప్రదాయికంగా ప్రపంచ బ్యాంక్ సారథ్యం అమెరికన్లకే దక్కుతోంది. తమ తరఫున ఆ పదవికి బంగా పేరును ప్రతిపాదించనున్నట్టు బైడెన్ ఫిబ్రవరిలోనే ప్రకటించారు. గతంలో మాస్టర్ కార్డ్ ఇంక్ చీఫ్‌గా వ్యవహరించిన బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న 300 పైగా పెద్ద అంతర్జాతీయ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్‌గాను, ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్‌గాను కూడా బంగా పని చేశారు. మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన బంగా పాఠశాల విద్యను సిమ్లాతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అభ్యసించారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక కావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు గర్వకారణం అన్నారు.
Hearty congratulations to Ajay Banga on being appointed as the President of World Bank. He is a bringer of change, always brimming with wonderful ideas to make the world a better place. He will definitely make a mark in his new role. Proud moment for India. Wish him the very… pic.twitter.com/Cuh1G6BJG2
— N Chandrababu Naidu (@ncbn) May 4, 2023
అజయ్ బంగా మాస్టర్ కార్డ్ సీఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు ఓ సారి కలశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఫిన్ టెక్ జోన్‌లో మాస్టర్ కార్డు కార్యాలయాన్ని పెట్టాలని కోరారు.దానికి అజయ్ బంగా అంగీకరించారు. ఏపీ ప్రభుత్వంతో కొన్ని ఎవోయూలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్ సర్కార్ వాటిని పట్టించుకోలేదు. దాంతో మాస్టర్ కార్డు కార్యాలయం ఏపీకి రాలేదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
Ajay Banga ఎవరో తెలుసా
— Venu M Popuri (@Venu4TDP) May 4, 2023
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అయిన భారతీయుడు .
ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన గతంలో మాస్టర్ కార్డు కి సీఈఓ గా కూడా ఉన్నాడు.
2017 వ సంవత్సరంలో ఈ అజయ్ బంగా గారిని ఒప్పించి వైజాగ్ ఫిన్ టెక్ జోన్‌లో మాస్టర్ కార్డ్ కంపెనీ పెట్టించటానికి ఒప్పించారు… pic.twitter.com/oWpzIQfG0F
అలాగే సీఐఐ సమ్మిట్ లో చంద్రబాబు పని తనం గురించి బంగా చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ పొగిడినట్లే బంగా కూడా చంద్రబాబును పొగిడారు.
World Bank President appointee and Indian-American business leader Ajay Banga shares an idea that he was to execute with @ncbn Garu when the two leaders wished to collaborate in the Fintech Space. pic.twitter.com/uUozXh5lFW
— Telugu Desam Party (@JaiTDP) May 4, 2023
GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?
Value Buys: మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్' మీ దగ్గర ఉన్నాయా?