TDP Formation Day 2022: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాజకీయ అనివార్యం: టీడీపీ ఏర్పాటుపై చంద్రబాబు
Chandrababu On TDP Formation Day: ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం 1982 మార్చి 29వ పార్టీని స్థాపించారు. టీడీపీని స్థాపించి నేటితో 40 వసంతాలు పూర్తయింది.
TDP Formation Day 2022: తెలుగుదేశం పార్టీ.. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రాణం పోసిన కొత్త తరహా రాజకీయం. నటుడిగా ఎన్నో మైలురాళ్లు చేరుకున్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం 1982 మార్చి 29వ పార్టీని స్థాపించారు (TDP was founded by N T Rama Rao on 29 March 1982). వందకు పైగా ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమంటే మాటలు కాదు. అలాంటిది పార్టీ పెట్టిన ఏడాదిలోపే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్. టీడీపీని స్థాపించి నేటితో 40 వసంతాలు పూర్తయింది.
ప్రజల ఆకాంక్షల కోసం పుట్టిన టీడీపీ..
తెలుగుదేశం పార్టీ 41వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నలభై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.... ఒక రాజకీయ అనివార్యమని పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల కోసమో... కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ టీడీపీ కాదన్నారు. ప్రజల కోసం... ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం.... ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందన్నారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.
తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2022
నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం....ఒక రాజకీయ అనివార్యం.(1/5)#40GloriousYearsOfTeluguDesam#TDPFoundationDay pic.twitter.com/0sAB67xDL2
టీడీపీతోనే అన్ని వర్గాలకు అధికారం.. (Chandrababu On TDP Formation Day)
‘కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే. ప్రాంతీయ పార్టీ గా ఉన్నా, జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపీ. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి టీడీపీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలని’ పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read: Cm Jagan Silence : ఆ విషయంపై తేల్చకుండానే వెనుదిరిగిన సీఎం జగన్