Devineni Uma Arrest: దేవినేని ఉమా అరెస్టు.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య కామెంట్స్ వార్

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టుపై.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నేతలు విమర్శల దాడి చేసుకుంటున్నారు.

FOLLOW US: 

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నేపథ్యంలో నిజనిర్ధరణకు మాజీ మంత్రి దేవినేని వెళ్లారు. పరిశీలన ముగించుకుని.. తిరిగి వస్తుండగా.. గడ్డమణుగ గ్రామం దగ్గర ఉమా వాహనంపై అకస్మాత్తుగా వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ కారణంగా ఒక్కసారిగా టీడీపీ, వైసీపీ నేతల నడుమ వివాదం నెలకొంది. ఇరు వర్గాల వారు.. దాడి చేసుకునే స్థాయికి గొడవ వెళ్లింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. అయితే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపిన దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయగా.. వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

ప్రశ్నిస్తే.. అరెస్టులా..

మీ బాస్‌కి ప‌ట్టిన గ‌తే మీకూ పడుతుందని ..వైసీపీ మైనింగ్ మాఫియాకు అడ్డుపడుతున్నారనే.. దేవినేని ఉమాను అరెస్టు చేశారని నారా లోకేశ్ విమర్శించారు.  దేవినేనిపై దాడిచేసిన నిందితుల‌పై ఐపీసీ సెక్షన్లు కింద కేసులుపెట్టి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. తిరిగి ఉమాపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవ‌స్థ ఏపీలో ఉండ‌టం దుర‌దృష్టక‌రమని విమర్శించారు. 

వైకాపా పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని యనమల రామకృష్ణుడు విమర్శించారు. సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. నిందితులను వదిలేసి బాధితులను అరెస్టు చేయడం ఏంటన్నారు. వసంత కృష్ణప్రసాద్‌ కనుసన్నల్లోనే గ్రావెల్‌ను దోచుకు తింటున్నారని యనమల ఆరోపించారు.  

బెయిల్​కు అనుకూలంగా లేని సెక్షన్లు దేవినేని ఉమాపై పెట్టడం సిగ్గు చేటని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. పోలీసులు పూర్తిపక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేసి ఉమాతో పాటు 18 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని దుయ్యబట్టారు.  వైకాపా నేతల అరాచకాలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 

మైలవరంలో దోచుకున్నది దేవినేని

టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమారలేదని ఎమ్మెల్మే మల్లాది విష్ణు మండిపడ్డారు. కృష్ణప్రసాద్‌ చేతిలో ఓటమిని దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. మైనింగ్‌లో అక్రమాలు జరిగితే.. అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రాత్రిపూట పరిశీలనకు వెళ్లి.. వైసీపీ నేతలపై దాడి చేస్తారా అని మాల్లాది ప్రశ్నించారు. గతంలో జక్కంపూడిలో దేవినేని ఉమాను ప్రజలే తరిమికొట్టారని విమర్శించారు.

దేవినేని ఉమాపై ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమా.. డ్రామా ఆర్టిస్టులను మండిపడ్డారు. మైలవరంలో దోచుకున్నది దేవినేని ఉమానేనని విమర్శించారు. ఆయనపై ఎలాంటి దాడి జరగలేదని.. దేవినేనితో వచ్చిన వాళ్లే దాడి చేశారని ఆరోపించారు. 

Published at : 28 Jul 2021 04:24 PM (IST) Tags: cm jagan Devineni Uma Arrest YSRCP Leaders On Devineni Arrest TDP Leaders On YSRCP Govt Ex Minister Devineni Arrest Updates Nara Lokesh

సంబంధిత కథనాలు

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

Doubts On Subramanyam death Case :సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఎన్నో అనుమానాలు ! వాటిని తీర్చేదెవరు ?

Doubts On Subramanyam death Case :సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి  కేసులో ఎన్నో అనుమానాలు ! వాటిని తీర్చేదెవరు ?

Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు

Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు

Tadipatri JC Prabhakar : దిండు దుప్పటితో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి - టెన్షన్ పడుతున్న తాడిపత్రి అధికారులు !

Tadipatri JC Prabhakar : దిండు దుప్పటితో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి - టెన్షన్ పడుతున్న తాడిపత్రి అధికారులు !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?