By: ABP Desam | Updated at : 27 Mar 2023 12:42 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ధర్మాసనం ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని, హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ‘విచారణ చేసే అధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి’ అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ రిపోర్టు మొత్తం చదివామని ధర్మాసనం చెప్పింది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదే అని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి చెప్పారు. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. ఆ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
ఈ హత్య కేసులో ఏ - 5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేశారు. దర్యాప్తు వేగంగా జరగడం లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ తులసమ్మ పిటిషన్‌లో కోరారు. గత సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయగా, దర్యాప్తు పురోగతిపై సీల్డ్ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది.
దీంతో దర్యాప్తు పురోగతి, పూర్వాపరాల విషయాలపై నివేదిక దాఖలు చేసినట్లు సమాచారం. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు. గత సోమవారం వాదనల సందర్భంగా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని అడిగింది. తాజాగా ఈ ఆదేశాలు ఇచ్చింది.
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం
Guntur: అరిష్టం పోగొట్టుకోడానికి గురూజీ దగ్గరికి మహిళ, శిష్యుల పాడు పని! పోలీసులకు ఫిర్యాదు
Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు
Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!