Supreme Court ON AP : కరోనా మృతుల పరిహారం దారి మళ్లింపు - ఏపీ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం !
కరోనా మృతుల పరిహారం దారి మళ్లింపు అంశంపై సుప్రీంకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కోరోనా ఆర్థిక సాయం ప్రజలకు అందకుండా దారి మళ్లించారని ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సాయం నిధులను పక్కదారి పట్టించడమేమిటని నిలదీసింది. కరోనా పరిహారం నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించిందని దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై సమగ్ర వివరాలతో మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
ఆ ఐఏఎస్‌లకు ఊరట - సేవా శిక్ష ఎనిమిది వారాలు సస్పెండ్ !
కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కరోనా పరిహారం నిధులను కేటాయించిన ఏపీ ప్రభుత్వం..అందులో ఏకంగా రూ.1,100 కోట్లను దారి మళ్లించిందని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నిధులను దారి మళ్లించిన ప్రభుత్వంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. వివరాలతో అఫిడవిట్‌కు ఇదే చివరి అవకాశం అని కూడా కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
అప్పులు దొరకవు డబ్బులు పంచలేరు - జగన్‌కు ప్రతిపక్ష స్థానమే వస్తుందన్న మాజీ సీఎస్ !
గతంలో ఈ పిటిషన్‌పై విచారణలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులను పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ డి ఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిధులను పిడి (పర్సనల్ డిపాజిట్) ఖాతాలకు మళ్లించడం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో పాటు అప్రాప్రియేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విపత్తు నిధుల దారిమళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కోర్టు ఉదహరించింది. ఇప్పటికే పీడీ ఖాతాల్లోకి తరలించిన నిధులను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వినియోగించవద్దని పేర్కొంది.
మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకు ఇస్తానంటే దుష్ట చతుష్టయం అడ్డుకుంది - సీఎం జగన్ విమర్శ
అయితే దేశంలో కొన్ని చోట్ల వైద్యులు కరోనా మరణాలపై తప్పుడు ధృవీకరణ పత్రాలను జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇదే కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కొవిడ్ బాధితులకు నష్టపరిహారంపై ఇప్పటికే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ కూడా జరిపింది. కేంద్రానికి ఈ కమిటీ నివేదిక సమర్పించింది.