అన్వేషించండి

AP IAS High Court : ఆ ఐఏఎస్‌లకు ఊరట - సేవా శిక్ష ఎనిమిది వారాలు సస్పెండ్ !

ఏపీ ఐఏఎస్‌ల సేవా శిక్షను ఎనిమిది వారాలు హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో గతంలో వారికి ఈ సేవా శిక్ష విధించారు.

సామాజిక సేవ శిక్షకు గురయిన ఐఏఎస్‌లకు హైకోర్టు ఊరట ఇచ్చిది. ఐఏఎస్‌లకు విధించిన సేవా శిక్షను 8 వారాల పాటు  హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కోర్టు ధిక్కరణ కింద 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు సింగిల్‌ జడ్జి సేవాశిక్ష వేసింది. ఈ శిక్షను డివిజనల్‌ బెంచ్‌లో గతవారం ఇద్దరు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. సేవాశిక్షను 8 వారాలపాటు  చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. సేవాశిక్షను ధర్మాసనంలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. జస్టిస్‌ అసదుద్దిన్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆరుగురు ఐఏఎస్‌ల సేవాశిక్షను 8 వారాలు సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు కోర్టు వాయిదా వేసింది. 

అప్పులు దొరకవు డబ్బులు పంచలేరు - జగన్‌కు ప్రతిపక్ష స్థానమే వస్తుందన్న మాజీ సీఎస్ !

 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలను తొలగించాలని 2020లో ఇచ్చిన ఉత్తర్వులను ఏడాదిపాటు అధికారులు పట్టించుకోకపోవడంతో సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా అధికారులు కోర్టు ఉత్తర్వుల అమలును నిర్లక్ష్యం చేశారన్న కారణంతో   ఐఏఎస్‌లు విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్‌ లకు  రెండు వారాలు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. వారు వెంటనే క్షమాపణలు చెప్పడంతో శిక్షలో మార్పు చేసింది. సేవా శిక్షను విధించింది.

సీఎం జగన్ అప్పుల అప్పారావు, మంత్రులు భజనగాళ్లు - శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు

ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని ఐఏఎస్‌లను ఆదేశించింది. విద్యార్థుల మధాహ్నం, రాత్రి భోజన ఖర్చులు భరించాలని తీర్పు వెల్లడించింది. సామాజిక సేవకు అంగీకరిస్తే క్షమాపణలను అంగీకరిస్తామని పేర్కొంది. సామాజిక సేవ చేసేందుకు 8 మంది ఐఏఎస్‌లు సిద్ధపడినట్లు వెల్లడించడంతో జైలుశిక్ష విధింపు తీర్పును సవరించినట్లు హైకోర్టు పేర్కొంది. అయితే తర్వాత వారు సేవా శిక్షను అనుభవించకుండా మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మొదట ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్ వేయడంతో  కోర్టు తిరస్కరించింది. 

మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకు ఇస్తానంటే దుష్ట చతుష్టయం అడ్డుకుంది - సీఎం జగన్ విమర్శ

తర్వాత ఇద్దరు ఐఎఎస్‌లకు డివిజన్ బెంచ్ రిలీఫ్ ఇచ్చింది. దీంతో మిగిలిన ఆరుగురు కూడా సేవా శిక్షను తప్పించుకునేందుకు రిలీఫ్ కోసం డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించి ఊరట పొందారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget