YS Sunitha : వివేకానందరెడ్డి హంతకులెవరు - శుక్రవారం ఢిల్లీలో సునీతారెడ్డి ప్రెస్ మీట్ !
YS Sunitha : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్రదారులెవరు అన్న అంశంపై ప్రెస్ మీట్ పెట్టేందుకు సునీతారెడ్డి సిద్ధమయ్యారు. ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు.
YS Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత.. తన తండ్రిని హత్య చేసిన నిందితులు, కుట్రదారులకు శిక్ష పడేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికి ఐదేళ్లు దాటిపోయినా ఆమె పోరాటం ఆగలేదు. తాజాగా ఆమె ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. తెలుగుమీడియాతో పాటు జాతీయ మీడియాను కూడా ఆహ్వానించారు. తన తండ్రి హత్యకు సంబంధించిన కుట్రదరులెవరు అన్న అంశంపై కొన్ని కీలక విషయాలను.. కొన్ని డాక్యుమెంట్లను ఆమె బయట పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్రదారులెవరో తేల్చి శిక్షపడేలా చేయడానికి వైఎస్ సునీతారెడ్డి అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు ముందుకు సాగకపోవడంతో హైకోర్టుకు వెళ్లి.. సీబీఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కుట్రదారులెవరో ఇంత వరకూ బయటపడలేదు. ఈ మధ్య కాలంలో ఎన్నో ట్విస్టులు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సీబీఐ విచారణ కూడా ఆగిపోయింది.
సుప్రీంలో సునీత పిటీషన్ :వైయస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ సునీత సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో వివేకా హత్యకు దాడి చేసిన పరిణామాలు అనంతరం సాక్షాదారాల జరిపివేతలో నిందితులు పాల్గొన్న తీరును ప్రస్తావించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లకు వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని మరోసారి సిబీఐ పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించారని ఎప్పటికి వివరించింది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గాని షర్మిల విజయమ్మల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని వివేక పట్టుబట్టినట్టు వివరించింది. దీన్ని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,శివ శంకర్ రెడ్డి భరించలేకపోయారని సిబిఐ చెప్పుకొచ్చింది. వివేక హత్యకు ఈ ముగ్గురే కుట్ర పన్నినట్లు హత్యా స్థలంలో లభించిన సాక్షాదారాలు చెబుతున్నాయని సిపిఐ వివరించింది. హత్య తర్వాత జరుగుతున్న పరిణామాల పై అప్రూవర్ గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసింది.
ఈ ముగ్గురి సమక్షంలోని చెరిపివేసినట్లు వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించింది. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు మెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరుకావాలని షరతు విధించింది. ఈ మేరకు ప్రతివారం అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు నర్రెడ్డి సునీతారెడ్డి ఎలాంటి విషయాలు ప్రెస్ మీట్‌లో బయట పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.