అన్వేషించండి

Students in Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులకు ఊరట, మే 23 నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు

కిర్గిస్థాన్‌లో పరిస్థితి సాధారణంగానే ఉందని మే 23 నుంచి ప్రతిరోజూ బిష్కెక్ నుంచి న్యూఢిల్లీకి రెండు విమాన సర్వీసులు నడుస్తాయని APNRTS విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి చరణ్‌జీత్ సింగ్ తెలిపారు.

Students Stranded in Kyrgyzstan | కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం తెలిసిందే. రాష్ట్ర విద్యార్థులు సైతం అక్కడ ఉంటడంతో పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) పర్యవేక్షిస్తోంది. తెలుగు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది.

విద్యార్థుల కోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రయత్నాలు 
ఏపీఎన్ఆర్టీఎస్ తమకు తెలిసిన, సేకరించిన సమాచారాన్ని.. విదేశాంగ శాఖ (MEA) ఇస్తున్న సలహాలను అక్కడి విద్యార్థులకు చేరవేస్తోంది. తమ ప్రయత్నాలకు కొనసాగింపుగా కిర్గిస్థాన్‌లో ఏపీ విద్యార్థుల భద్రత, శ్రేయస్సును గురించి, ప్రస్తుత పరిస్థితి, విద్యార్థుల సమస్యల గురించి కేంద్రానికి వివరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యురేషియా అదనపు కార్యదర్శి చరణ్‌జీత్ సింగ్ కార్యాలయంతో చర్చలు జరుపుతోంది. కిర్గిస్థాన్‌లోని ఏపీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన/వస్తున్న అభ్యర్థనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వివరించి, విద్యార్థులను స్వదేశానికి రప్పించే అవకాశాలపై ఏపీఎన్ఆర్టీఎస్ ఆరా తీసింది.

బిష్కెక్‌లో ప్రస్తుత పరిస్థితి సాధారణం 
యురేషియా అదనపు కార్యదర్శి కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిర్గిస్థాన్ లో విద్యార్థుల పరిస్థితిపై స్పందించారు. కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ (APNRTS)కు తెలిపింది. భారత వైద్య విద్యార్థులు దేశానికి తిరిగి రావడానికి ముందు, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. విద్యార్థులు భారతదేశానికి తిరిగి రావాలి అనుకుంటే మే 23 (గురువారం) నుంచి బిష్కెక్ నుండి న్యూఢిల్లీకి నేరుగా ప్రతిరోజూ 2 విమానాలు నడుస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఏదైనా అత్యవసర సహాయం కోసం, భారతీయ/తెలుగు విద్యార్థులు బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయంను 0555710041 హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

కిర్గిస్థాన్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడవద్దని సూచించారు. అయితే అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని ఏపీఎన్ఆర్టిఎస్ విజ్ఞప్తి చేసింది. కిర్గిస్థాన్‌లోని ఏపీ విద్యార్థులు సహాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్‌లైన్ నంబర్లు  +91 863 2340678; +91 85000 27678 (వాట్సాప్) 24 గంటలు అందుబాటులో ఉంటాయని, లేదా ఇమెయిల్ info@apnrts.com; helpline@apnrts.com ను సంప్రదించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget