అన్వేషించండి

Sri Chaitanya Educational Institutions: 3 గంటలు, 600 మ్యాథ్స్ ఫార్ములాలు - ప్రపంచ రికార్డుకు శ్రీచైతన్య విద్యా సంస్థలు సిద్ధం, బాల మేథావుల ప్రపంచ రికార్డుల వేడుక

Andhra News: శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. 3 - 10 ఏళ్ల చిన్నారులు 3 గంటల్లో 600 మ్యాథ్స్  ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డ్ సృష్టించబోతున్నారు.

Sri Chaitanya Institutions World Record: శ్రీచైతన్య విద్యా సంస్థలు (Sri Chaitanya Educational Institutions).. 39 ఏళ్ల క్రితం ప్రారంభమై విద్యా వ్యవస్థలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నాయి. సామాన్య విద్యార్థులను సైతం విశ్వ విజేతలుగా తీర్చిదిద్దుతూ ఐఐటి-జేఈఈ, ఏఐఈఈఈ, నీట్, ఒలింపియాడ్ వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో నెం.1 ర్యాంకులు సాధిస్తూ… విద్యారంగంలో అగ్రగామిగా ప్రపంచ రికార్డులను సైతం సాధించాయి. ఇప్పుడు ఓ సరికొత్త ప్రపంచ రికార్డ్  సాధించేందుకు సమాయత్తమవుతోంది. గణితంలో బాల మేధావుల ప్రతిభా పాటవాలను విశ్వ వ్యాప్తం చేసేందుకు సంకల్పించి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. ఇందుకోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UKతో కలిసి పని చేస్తున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా శ్రీచైతన్య భారీ స్థాయి విజయాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందించడం మాత్రమే కాకుండా, శ్రీచైతన్య సాధించబోయే రికార్డులతో విద్యార్థులకు ప్రేరణ కల్పించాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను.. వివిధ రంగాల్లో సాధించిన అద్భుత విజయాలను డాక్యుమెంట్ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK సంస్థ అసాధారణ మానవ సామర్థ్యాలను గుర్తించి, శ్రేష్ఠత వైపు ప్రయాణించాలనే ఉద్దేశంతో ఇతరులు స్ఫూర్తి పొందేందుకు వేదికగా పనిచేస్తుంది. 

3 ప్రపంచ రికార్డులు

శ్రీచైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల అసాధారణ సామర్థ్యాలను, వినూత్న అభ్యాస విధానాలను ప్రదర్శిస్తూ మూడు ప్రత్యేక ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి.

  • 2018లో 2.5–5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యార్థులు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో అద్భుతమైన ఫీట్ సాధించారు.
  • 2022లో 601 మంది విద్యార్థులు 118 అంశాలను పఠించి, 10 రాష్ట్రాల్లో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టికను ప్రదర్శించారు.
  • 2023లో 2,033 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 1 నుంచి 100 వరకు గుణకార పట్టికలను పఠించారు. ఇది శ్రీచైతన్య 100 రోజుల  అంకితభావంతో కూడిన శిక్షణకు నిదర్శనం.

2024 నవంబర్ 6న విద్యా నైపుణ్యంలో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. 20 రాష్ట్రాల నుంచి 10 వేల మంది ప్రతిభావంతులు పాల్గొనే ఈ చారిత్రాత్మక ఘట్టంలో 3 - 10 సంవంత్సరాల వయసున్న చిన్నారులు కేవలం మూడు గంటల్లో 600 మ్యాథ్స్  ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డ్ సృష్టించబోతున్నారు. విద్యారంగ చరిత్రకే తలమానికంగా నిలవబోతోన్న ఈ ఈవెంట్ కోసం శ్రీచైతన్య విద్యాసంస్థ తమ విద్యార్దులకు 100  రోజుల్లో అకుంఠిత దీక్షతో  శిక్షణ ఇచ్చి ఈ మహా యజ్ఞానికి సిద్ధం చేశారు. సూపర్ హ్యాట్రిక్ ప్రపంచ రికార్డు ప్రయత్నించేందుకు  భారతదేశం నలుమూలల నుంచి శ్రీ చైతన్య విద్యార్థులు ఒక చారిత్రాత్మక విజయ సాధన కోసం కలిసి వస్తున్నారు. 

ఈ వేదిక శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ ఎక్సలెన్స్‌ను మాత్రమే కాకుండా, విద్యా సాధనలో కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడంలో సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. శ్రీ చైతన్య యాజమాన్యం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు 10,000 మంది విద్యార్థులకు తమ హృదయపూర్వక మద్దతు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న బాల మేధావులందరికి శుభాకాంక్షలు! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Tim Southee: ఇంగ్లండ్‌తో ఆడేదే ఆఖరి మ్యాచ్- టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన టిమ్‌ సౌథీ
ఇంగ్లండ్‌తో ఆడేదే ఆఖరి మ్యాచ్- టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన టిమ్‌ సౌథీ 
Embed widget