Sharmila comments : మీ ఓటు వైఎస్ఆర్ బిడ్డకా ? వివేకా హంతకుడికా ? పులివెందుల ప్రజలకు షర్మిల ప్రశ్న
Andhra News : జగన్ హంతకుడికి టిక్కెట్ ఇవ్వడం వల్లనే తాను పోటీ చేస్తున్నానని షర్మిల ప్రకటించారు. పులివెందులలో సునీతతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
![Sharmila comments : మీ ఓటు వైఎస్ఆర్ బిడ్డకా ? వివేకా హంతకుడికా ? పులివెందుల ప్రజలకు షర్మిల ప్రశ్న Sharmila declared that she is contesting only because Jagan ticket to a murderer Sharmila comments : మీ ఓటు వైఎస్ఆర్ బిడ్డకా ? వివేకా హంతకుడికా ? పులివెందుల ప్రజలకు షర్మిల ప్రశ్న](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/59ebd6ddf4c53222acff22f3855b1e1e1712910312275228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sharmila Pulivendula campaign : హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు. ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు ..అధర్మం మరోవైపు ఉన్నాయని, ధర్మ పోరాటం ఒకవైపు, డబ్బు,అధికారం మరోవైపు ఉన్నాయన్నారు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా.. హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. పులివెందులలో ఆమె సునీతతో కలిసి ప్రచారం నిర్వహించారు.
న్యాయం ఒకవైపు ..అధర్మం ఒకవైపు ..ధర్మ పోరాటం ఒకవైపు...డబ్బు,అధికారం ఒకవైపు ఉన్నాయన్నారు. న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా ? హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తరా అని ప్రజల్ని ప్రశ్నించారు. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యిందమని వైఎస్ఆర్,వైఎస్ వివేకా ఆత్మలు క్షోబిస్తున్నాయన్నారు. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యిందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్, వైఎస్ వివేకా ఆత్మలు క్షోబిస్తున్నాయని, సొంత బాబాయిని నరికి చంపితే తన అన్నయ్య జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్, వివేకానంద రెడ్డిలు ఈ జిల్లా బిడ్డలని, మేము కూడా మీ ఇంటి బిడ్డలమని షర్మిల తెలిపారు.
వైఎస్ఆర్ కి ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమని, జీవించినంతకాలం ఇక్కడి ప్రజల కోసమే జీవించారన్నారు. తాను ఉన్నంతకాలం ఇక్కడి ప్రజలకు సేవ చేశారన్నారు. వివేకానంద రెడ్డి సైతం ఇక్కడి ప్రజలకు సేవ చేవారన్నారు. - వైఎస్ఆర్,వివేకా వంటి నాయకులు మళ్లీ దొరకడం కష్టమన్నారు. తన బాబాయి వివేకానంద రెడ్డి గొడ్డలి పోట్లకు బలయ్యారన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయి ఐదేళ్లయినా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా ఆత్మ ఇవాల్టికీ ఘోషిస్తుందన్నారు. హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్పడానికి ఆధారాలున్నా..ఇప్పటివరకు శిక్ష పడలేదని స్వయంగా సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు
అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారన్నారు. హంతకులను కాపాడటానికా ప్రజలు అధికారం ఇచ్చిందంటూ ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తోందన్నారు. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డానని, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని.. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని ఆమె కోరారు.
ప్రచారంలో సునీత కూడా ప్రసంగించారు. ఎంపీగా గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, ప్రజల కోసం పనిచేయకుండా ఎక్కడ తిరుగుతున్నారని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. కడప జిల్లా ప్రజలు న్యాయం వైపు ఉన్నామా.. అన్యాయం వైపు ఉన్నామా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని, తప్పు చేయకుంటే బయం ఎందుకని సునీత ప్రశ్నించారు. ధర్మం వైపు షర్మిల నిలబడిందని, ప్రజలు గెలిపించాలని సునీత కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)