YS Sharmila : పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే - వైసీపీపై షర్మిల జోస్యం
Andhra Politics : వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందన్నట్లుగా షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వైసీపీని పిల్ల కాలువతో పోల్చిన ఆమె చివరికి సముద్రంలో కవాల్సిందేనని చెప్పుకొచ్చారు.
Sharmila On YSRCP : పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేనని వైసీపీ గురించి షర్మిల నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించిన తర్వాత విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ పై వ్యతిరేకత ఎజెండాగానే ఎన్నికలు
ఏపీలో ఈ సారి ఊహించని ఫలితాలు వచ్చాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఓకే నిర్ణయం మీద ఆధారపడి జరిగిన ఎన్నికలన్నారు.
జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా జరిగిన ఎన్నికలని విశ్లేషించారు. ఈ సారి ప్రజలు తమ ఓటు కి న్యాయం జరగాలి అనుకున్నారని.. ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టం చేశారు. ప్రజల గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈ సారి కాంగ్రెస్ కూడా మంచి ఫలితాలు తీసుకు రాలేక పోయిందన్నారు. ఎన్నికలకు ముందు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నామని.. 64 నియోజక వర్గంలో నేను సభల్లో పాల్గొన్నానన్నారు. అయితే ప్రజలు ఒక్క ఓటు కూడా వృధా కావొద్దనుకున్నారని.. అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు.
కాంగ్రెస్ సముద్రం - పిల్ల కాలువలు అందులో కలవాల్సిందే
పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని.. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని షర్మిల వ్యాఖ్యానించారు. వైసిపి నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీ ఉంటుంది..పద్ధతి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే సీట్ల పంపిణీ జరిగిందన్నారు. తనపై సుంకర పద్మశ్రీ చేసిన చిల్లర ఆరోపణలు నేను పట్టించుకోలేదని.. వాళ్ళ మీద పార్టీ తరుపున కఠిన చర్యలు తీసుకుంటాని ప్రకటించారు.
రాహుల్ ఒక ఫైటర్
ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయని.. రాహుల్ పాదయాత్ర న్యాయం కోసం,ఐక్యత కోసం చేసిన పోరాటం ఫలిచిందన్నారు. ఎంతోమంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ కష్టం వల్ల ఎంతో లాభం కలిగిందన్నారు. ప్రతి కార్యకర్త ను గర్వగంగా నిలబెట్టాడని.. రాహుల్ కి మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నామన్నారు. బీజేపీ రాహుల్ దెబ్బకు చితికల పడిందని.. ఇండియా బ్లాక్ మంచి ఫలితాలను చూపిందన్నారు. కొద్దిగా ఇండియా బ్లాక్ కష్టపడి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారని జోస్యం చెప్పారు.
కడప పరిస్థితి వేరు
కడపలో వైసీపీ ఎంపీ ఉన్నాడు...ఎంఎల్ఏ ఉన్నాడు.. అక్కడ ప్రజలు భయబ్రాంతులకు గురి చేశారని. ఓటుకి 3500 పైగా ఇచ్చారని షర్మిల ఆరోపించార.ు ఒడిస్తే పథకాలు ఆపుతాం అని బెదిరించారన్నారు. నేను ఎంపీగా గెలవక పోవడం టైం మాత్రమేనని.. నేను 14 రోజులు చాలా కష్ట పడ్డాను ..చాలా రూరల్ ప్రాంతాల్లో నేను పోటీ చేస్తున్నట్లు తెలియలేదన్నారు. హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని మాత్రమే పోటీ చేశానని.. అది జరగలేదు..ప్రజల కంటే పైన ఉన్నది దేవుడు.. హంతకుల ను పైన దేవుడు శిక్షిస్తాడన్నారు.