By: Harish | Updated at : 29 Nov 2022 04:41 PM (IST)
సీఎం జగన్ నివాసానికి అదునాతన భద్రత
AP CM Jagan Security : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గర భద్రతను మరింత పటిష్టం చేశారు. అత్యాధునిక సెక్యూరిటీ పరికరాలను రూ. రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో ఈ సెక్యూరిటీ పూర్తిగా పోలీసుల అధీనంలోకి రానుంది. సీఎం ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిపై అక్కడ క్కడా చెక్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు చెక్ పోస్టులు లేకుండా సాంకేతిక పరిజ్ణానంతో భద్రతను అందుబాటులోకి తీసుకువచ్చారు.టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్( Bollards,Tyre killers)ను ఇందు కోసం ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాదు ఇప్పటి వరకు 45 సీసీ కెమరాలను సీఎం ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేశారు.ఇప్పుడు వాటి సంఖ్యను కూ 65కి పెంచారు.
టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేసిన ప్రైవేటు సంస్థ - రూ. రెండు కోట్ల వ్యయం
సీఎం ఇంటికి భద్రత విషయంలో ప్రభుత్వ నిఘా వర్గాలు నుండి వచ్చిన సమాచారం అధారంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటారు. కొన్ని భద్రతా అంశాలు మాత్రం నిత్యం అమలులో ఉంటాయి .సీఎం ఇంటికి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్( Bollards,Tyre killers) వంటి పరికరాలను మూడు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయాల్సి ఉంది. సీఎంగా జగన్ బాద్యతలు స్వీకరించిన తరువాత కరోనా కారణంగా రెండు సంవత్సరాలు కాలం గడిచిపోయింది.ఇక ఆ తరువాత సీఎం ఇంటికి వెళ్ళే రహదారి లో ఆక్రమణల తొలగింపు, రహదారి నిర్మాణానికి మరో ఏడాది కాలం సరిపోయింది. ఇప్పుడు ఈ భద్రతా పరికరాలను ఏర్పాటు చేసేందుకు మూడు నెలలకు పైగా సమయం పట్టింది. భద్రతా పరికరాల ఏర్పాటు వ్యవహరాన్ని ప్రభుత్వం ప్రైవేట్ సంస్దకు అప్పగించింది. సదరు సంస్ద నిర్మాణాలను పూర్తి చేసింది. ప్రస్తుతం ట్రయిల్ రన్ కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో అదికారిక వర్గాలకు ప్రైవేట్ సంస్ద పూర్తి స్దాయి భద్రతా పరికరాలను అప్పగిస్తుంది.
సెక్యూరిటీ పరంగా సున్నితమైన ప్రాంతంలో సీఎం జగన్ నివాసం
సీఎం నివాసానికి అత్యంత సమీపంలోనే కలకత్తా, చెన్నై జాతీయ రహాదారి ఉంది. ఇక మరో పక్క రైవస్ కాలువ ఉంది. మరో వైపున ఇళ్లు కూడ ఉన్నాయి. నాలుగు వైపులా సీఎం ఇంటికి భద్రత విషయంలో పోలీసుల నిత్యం 2 4గంటల పాటు కాపలా కాస్తూంటారు. దీంతో సాదారణ మనిషి ఎవ్వరూ సీఎం ఇంటికి వెళ్లటం అసాద్యం అనే చెప్పాలి. ఇక సీఎం ఇంటి ముట్టడికి ఆందోళన కారులు పిలుపునిస్తే, ఇక ఆ సమయంలో పోలీసులు పడే హైరానా అంతా ఇంతా కాదు. పోలీసుల ఫ్రెష్టేషన్ ను సాదారణ ప్రయాణీకుల పై చూపించటం పరిపాటిగా మారింది. అప్పటికప్పుడు సీఎం ఇంటి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్షన్ చేస్తుంటారు. బయట వ్యక్తులను సీఎం ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళనీయ్యరు. సాధారణంగా సీఎం ఇంటికి ఉండే భద్రత కన్నా రెండింతలు అదనంగా బలగాలను మోహరిస్తారు. దీని వలన ట్రాఫిక్ కు కూడ చాలా సార్లు ఇబ్బందులు వచ్చిన సందర్బాలు ఉన్నాయి.
సీఎం సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్న నిఘా విభాగం
సీఎం స్దాయి వ్యక్తి భద్రత అంటే ఆషామాషీ కాదు .దీంతో సాదారణ ప్రజలు కూడ సర్దుకుపోవాల్సి ఉంటుంది. .తాడేపల్లి లోని తన ఇంటి నుండి సీఎం కాలు బయట పెట్టింది మెదలు ఆయన గమ్యం చేరు వరకు పోలీసుల ఉరుకులు పరుగులు పెట్టి భద్రత కల్పిస్తారు.అసాంఘిక శక్తులు,అల్లరి మూకలు సీఎం వైపు కనీసం చూసేందుకు కూడ వీలు లేకుండా భద్రతను పర్యవేక్షిస్తారు. అందుకే రూ. రెండు కోట్లు వచ్చించి... దేశంలో ఏ సీఎంకు లేని విధంగా ఇంటి చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
CM Jagan: తోడేళ్లన్నీ ఓవైపు, మీ బిడ్డ సింహంలా మరోవైపు - అస్సలు భయం లేదు: సీఎం జగన్
Batchula Arjunudu Hospitalised:: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత- చంద్రబాబు ఆరా!
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
సీఐడీ విచారణకు విజయ్ హాజరు- తాడేపల్లి డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోందని టీడీపీ ఆరోపణ
Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?
2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే