Sajjala Ramakrishna Reddy : సునీత ముసుగు తొలగిపోయింది - హంతకులతో చేతులు కలిపారు - సజ్జల కౌంటర్
Sajjala Ramakrishna Reddy : వైఎస్ సునీతపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చంద్రబాబు ఏజెంటుగా మారారని ఆరోపించారు.
![Sajjala Ramakrishna Reddy : సునీత ముసుగు తొలగిపోయింది - హంతకులతో చేతులు కలిపారు - సజ్జల కౌంటర్ Sajjala Ramakrishna Reddy made sensational comments on YS Sunitha Sajjala Ramakrishna Reddy : సునీత ముసుగు తొలగిపోయింది - హంతకులతో చేతులు కలిపారు - సజ్జల కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/5558979c3739c7f7f76acf0fba17fd431709284535511228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sajjala Ramakrishna Reddy made sensational comments on YS Sunitha : వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సునీత చేసిన వ్యాఖ్యలపై సచివాలయం వద్ద స్పందించారు. వైఎస్సార్సీపీకి ఆనాడు పూర్తి మెజార్టీ ఉంది. విజయమ్మను ఓడించాలనుకుని వివేకాను దగ్గరకు తీసుకున్నారన్నారు. అసలు వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరు?.. చంద్రబాబు, బీటెక్ రవి కాదా? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జట్టు కట్టారని ప్రశ్నించారు.
సునీత ఈ రోజు ముసుగు తీసేసింది. ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయిందన్నారు. ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే విషయం అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు చేతిలో సునీత ఓ పావులా మారారని ఆరోపించారు. వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే. నాలుగైదు రోజుల్లో తేలిపోవాల్సిన కేసు అని సునీతే అంటున్నారు. మరి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును సునీత అడగాలి కదా అని ప్రశ్నించారు. తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకున్నారని.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు ఉన్నాయి. విచారణ అన్నింటిపైనా జరుగుతుందని స్పష్టం చేారు.
బీజేపీతో కలిసిపోయినట్లు చంద్రబాబు చెప్తున్నారని.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఎదురుచూస్తున్నారని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్డీయేలో కలిస్తే మంచిదే కదా .. ఇప్పటికైనా ముసుగులు అన్ని తొలగిపోతాయన్నారు. విజన్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పని చేస్తున్నారని ప్రస్నించారు. 24 సీట్లను పవన్ 240 సీట్లు అనుకుంటున్నట్టున్నాడు. తాడేపల్లి గూడెం సభ అట్టర్ ప్లాప్. తొలి సమావేశం తోనే టీడీపీ, జనసేన పొత్తు ఫెయిల్ అని తేలిపోయింది. కాపు నాయకులకే అర్థమైపోయింది పవన్ అందరిని మోసం చేశాడని. పోటీకి అభ్యర్థులు లేని పవన్ కల్యాణ్ ఎవరిని అధఃపాతాళానికి తొక్కుతాడు?. పదేళ్ల కిందట పార్టీ పెట్టిన పవన్ అసలేం సాధించారు అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గుండాలు, స్మగ్లర్లు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళని చంద్రబాబు తన పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారు?.’’ అని సజ్జల ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలంటే సీరియస్ గా రాజకీయ పార్టీని పెట్టాలన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా పవన్ ముందుకు రావడం లేదని.. కాపు ఓట్ల కోసం చంద్రబాబు పవన్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పెట్టుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పవన్ కళ్యాణ్ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)