అన్వేషించండి

Tension in Punganur : పుంగనూరులో ఉద్రిక్తత - రామచంద్రయాదవ్ రైతు భేరీని అడ్డుకున్న పోలీసులు !

Ramachandra Yadav : పుంగనూరు నియోజకవర్గంలోని సదుంలో బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ చేపట్టిన రైతుభేరి సభను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత యఏర్పడింది.


BCY party leader Ramachandra Yadav House Arrest :  పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.. సదుం మండలంలో రైతుభేరి కార్యక్రమంను చేపట్టిన బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ను అడ్డుకుని పోలీసులు‌ నోటీసులు జారీ చేశారు.. రైతుభేరి కార్యక్రమంపై హైకోర్టును రామచంద్ర యాదవ్ ఆశ్రయించడంతో రైతుభేరి కార్యక్రమంను నిర్వహించేందుకు  హైకోర్టు అనుమతులు ఇచ్చిందని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. అయితే  రైతుభేరి నిర్వహించేందుకు వీలులేదంటూ బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కు నోటీసులు ఇచ్చారు.. రామచంద్ర యాదవ్ ఇంటికి నలువైపులా పోలీసులు చుట్టుముట్టారు.. దీంతో‌పాటుగా రామచంద్ర యాదవ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో పోలీసులు 144  సెక్షన్ నిర్వహించారు.. జిల్లా నలువైపులా నుండి రైతులు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటుగా, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పుంగనూరుకు అనుమతించారు. 

పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ మండిపడ్డారు.  పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి పిరికి పందలా వ్యవహరిస్తున్నారని   బోడే రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల అనంతరం స్ధానిక‌ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాడిరైతులకు అన్యాయం చేస్తున్నారో విషయంపై రైతుభేరి చేపట్టామన్నారు. రైతుభేరి సభకు ప్రారంభం అయిన బోడే రామచంద్ర యాదవ్ ను పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. సభ నిర్వహించడానికి పోలీస్ శాఖ అనుమతి లేదని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. అనంతరం తన నివాసంలో రామచంద్ర యాదవ్ మీడియా
సమావేశం ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డిపై ఘాటువ్యాఖ్యలు చేశారు. ఈ‌నెల 4వ తేదీన రైతుభేరికి అనుమతి‌ పత్రం‌ అందజేస్తే పోలీసులు నిరాకరించారని, దీనిపై పూర్తి స్ధాయిలో అనుమతులు ఇవ్వాలని హైకోర్టు ను ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు దీనిపై స్పందించి రైతు భేరికి అనుమతులు ఇచ్చినా… కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన పోలీసులు రైతుభేరి నిర్వహించేందుకు వీలులేదని నోటీసులు ఇవ్వడంతో పెద్దిరెడ్డి రాజ్యాంగం పుంగనూరులో అమలు అవుతుందని మండిపడ్డారు. 

మరో గంటలో మీటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ముందస్తు సమాచారం లేకుండా ఇప్పుడు వచ్చి అనుమతులు లేవని అడ్డుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు.  ఒక్క వ్యక్తి రాజకీయం‌కోసం ఎస్పీ విధుల దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు లో నియంత పాలన సాగుతుందని తెలిపారు. పుంగనూరులో‌ రైతులను మోసం చేసి, రైతుల‌ భూములను లాక్కోలేదా అని ప్రశ్నించారు.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంత పిరికి పందా అని ఎవరు అనుకోరని, పోలీసులను అడ్డుపెట్టుకుని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారన్నారు.  పెద్దిరెడ్డి ప్రజలను, రైతులను పూర్తిగా ఇబ్బందులకు పెడుతున్నారని విమర్శలు చేశారు. ఎవరూ ఏం చేసిన పుంగనూరు నియోజకవర్గం ప్రజల‌పక్షాణ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కచ్చితంగా నేను రైతుభేరి కార్యక్రమం నిర్వహించి తీరుతామన్నారు. పెద్దిరెడ్డికి రాజకీయ లబ్ధి చేకూరేందుకే‌ జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పెద్దిరెడ్డి ఇలాంటి చర్యలు చేస్తున్నారని అన్నారు.తప్పు చేసే పోలీసు అధికారులపై నేను పోరాటం చేస్తామన్నారు. 

మహిళను అర్ధరాత్రి వరకూ పోలీసు స్టేషను లో పెట్టి వేధించే కార్యక్రమం చేపట్టారని తెలిపారు.  ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ వద్దకు తీసుకెళ్తామన్నారు. పెద్దిరెడ్డి పాల ఫ్యాక్టరీలో ఒక్కో లీటర్ పై పది రూపాయలు దోపిడి జరుగుతుందని…. ఆ దోపిడి ఎక్కడ భయటపెడతామో అని రైతు బేరిని అడ్డుకుంటున్నారని తెలిపారు. నెలలో కోట్ల రూపాయలు పాల ద్వారా దొపిడి జరుగుతుందన్నారు. రాష్ట్రం వీళ్ళ జాగీరా అన్నట్లుగా వైసీపి ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడూ ‌వచ్చిన బిసివై పార్టీ వైసీపి ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేసారు. వైసీపిని ఎప్పటికైనా ఇంటికి పంపేందుకు బిసివై పార్టీ సంసిద్ధం అయిందన్నారు. పోలీసు అధికారులు చేస్తున్న ఘటనలపై ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎవరిది ఏ స్ధాయో ప్రజలందరికి తెలుసునిపులివెందుల్లో జగన్ చేసి‌న తప్పుల పిర్యాదు చేసానని అన్నారు. పుంగనూరులో ప్రజాస్వామ్యం పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget