Tuni Municipal Latest News: తునిలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ, చివరకు..
Tuni Municipal Latest News: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కాపాడుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ ఇప్పుడు ఛైర్మన్ పదవిని కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది.

Tuni Municipal Latest News: తుని మున్సిపల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజుకున్న ఆధిపత్య పోరులో క్రమక్రమంగా వైసీపీ పట్టు తప్పుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీకి చెందిన అయిదుగురు కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో వైసీపీ బలం 12 మందికి పడిపోగా టీడీపీ 16 మందితో చైర్మన్‌గిరి దక్కించుకోవడానికి సిద్ధ పడుతోంది. దీంతో ముందస్తుగానే తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి రాజీనామా చేశారు. మున్సిపాలిటీలో తమకు 18 మంది బలం ఉందని వైసీపీ చెబుతూ రాగా అప్పటికి 15మంది మాత్రమే హాజరు అవుతుండగా అందులో ముగ్గురు మున్సిపల్ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. మరో ముగ్గురు టీడీపీ క్యాంప్‌లో చేరారు. దీంతో వైసీపీ బలం 12కు పడిపోయింది. అయితే తన పదవికి రాజీనామా చేసిన చైర్‌పర్సన్ సుధారాణి తాను సాధారణ కౌన్సిలర్‌గానే కొనసాగుతానని వెల్లడిరచినట్లు తెలుస్తోంది.
Also Read: నదీసాగర సంగమం వద్ద స్నానాలు ఎందుకు చేస్తారు - మహా శివరాత్రి ఎందుకు ప్రత్యేకం!
4 సార్లు వాయిదా పడిన వైస్‌చైర్మన్ ఎన్నిక..
తుని మున్సిపల్‌లో 30 మంది కౌన్సిలర్లుకు ప్రస్తుతం 28 మంది వరకు కౌన్సిలర్లు ఉండగా వీరిలో 18 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా మిగిలిన 10 మంది టీడీపీ కౌన్సిలర్లు.. ఇదిలా ఉంటే మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికోసం టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్నాయి. దీంతో ఇటీవల పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాలుగోసారికూడా మళ్లీ వాయిదాపడింది. దీని వెనుక మాజీ మంత్రి దాడిశెట్టి రాజానే కారణమని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. పది మంది వరకు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీను వీడి టీడీపీలో చేరారు. వీరిని మాజీ మంత్రి యనమల రామృకృష్ణుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఒక్కొక్కరూ పార్టీని వీడిపోవడంపై రాజీనామా చేయాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కౌన్సిలర్లుపై ఒత్తిడి తెచ్చారని, అయితే తాము రాజీనామా చేయమని తేల్చిచెప్పి టీడీపీలో చేరినట్లు వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తుని పురపాలక సంఘం టీడీపీ ఖాతాలో ఖరారు కాబోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
టీడీపీ దౌర్జన్యం చేస్తోంది: మాజీ ఛైర్‌పర్సన్ సుధారాణి
తుని పట్టణంలో శాంతి భద్రతలు ఉండేందుకే తాను తన ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏలూరి సుధారాణి అన్నారు. తన రాజకీయ చరిత్రలో మహిళా ప్రజాప్రతినిధిపై కేసు పెట్టిన ఘనత యనమల కుటుంబానికే చెల్లుతుందన్నారు. కౌన్సిలర్లును మేము నిర్భంధించినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ తనపైనా, వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజాపై కేసులు పెట్టారన్నారు. వైస్ ఛైర్మన్ ఎలాగూ దౌర్జన్యంతో లాక్కుంటున్నారని, వారికి కావ్వాల్సింది ఇక ఛైర్మన్ పదవి అని, వారికి కావాల్సిన ఎజెండా నెరవేర్చుకునేందుకు అధికారమధంతో తమ కౌన్సిలర్లుపై దాడులకు తెగబడుతున్నారని, అందుకే తానే రాజీనామా చేసినట్లు తెలిపారు.
Also Read: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్





















