అన్వేషించండి

Tiger In Eluru Agency: ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు పోలాలకు వెళ్లడం లేదని, త్వరగా పులిని పట్టుకోవాలని కోరారు.

బుట్టాయగూడెం: తెలంగాణలోని కావడిగుడ్ల ప్రాంతం నుండి ఏపీలోకి ప్రవేశించిన ఒక పెద్ద పులి, గత నాలుగు రోజులుగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. పందిరిమామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం వంటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఇప్పటికే కొన్ని పశువులపై దాడి చేసిన ఈ పులి, తాజాగా కన్నాపురం ఫారెస్ట్ పరిధిలోని బిలిమిల్లి గ్రామంలో మరో రెండు పశువులను హతమార్చింది. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలకు వెళ్లడానికి కూడా రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ పనికి వెళ్లడం లేదని, పులిని త్వరగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు.

కొయ్యలగూడెం, బుట్టాయగూడెం పరిసర ప్రాంతాలవారు సాయంత్రం తరువాత ఒంటరిగా తిరగవద్దని, పొలాలకు కూడా వెళ్లవద్దని కన్నాపురం రేంజ్ అధికారి భానుప్రకాశ్, ఎమ్మార్వో నాగరాజు, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య ప్రజలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే దిప్పకాయలపాడు - బిలిమిల్లి మధ్య రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్న తోటలో పులి కదలికలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. కెమెరా అలజడికి పులి పరుగులు తీయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.


Tiger In Eluru Agency: ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!

పులి సంచారం దృష్ట్యా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఆచూకీని నిరంతరం పర్యవేక్షించేందుకు 19 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, దానిని బంధించేందుకు రెండు బోనులను కూడా సిద్ధం చేశారు. రాత్రి వేళల్లో పులి సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉందని, అది కరగపాడు, కొవ్వాడ మీదుగా నేషనల్ పార్కులోకి ప్రవేశించవచ్చని డీఎఫ్‌వో పి.వి. సందీప్‌రెడ్డి అంచనా వేశారు. ఈ లోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Tiger In Eluru Agency: ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!

మరోవైపు, పులి ఆవాస ప్రాంతాలకు చేరువలో ఉండటంతో అధికారులు ప్రజలను హెచ్చరించారు. సబ్‌ డీఎఫ్‌వో వెంకట సుబ్బయ్య, తహసీల్దారు నాగరాజు ఆధ్వర్యంలో గ్రామాల్లో టాంటాం వేయించి, ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాలకు వెళ్లవద్దని సూచించారు. బుట్టాయగూడెం-కన్నాపురం మార్గంలో పులి రహదారి దాటుతుండగా కారు యజమానులు గమనించినట్లు సమాచారం అందడంతో, ఆ పరిసర ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.


Tiger In Eluru Agency: ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!

ట్రాప్ కెమెరా కదలికలతో బెదిరిపోయిన పులి
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో బిల్లిమిల్లిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దిప్పకాయలపాడు, బిల్లిమిల్లి మధ్యలో రోడ్డు పక్కన తోటలో డ్రోన్ కెమెరాకు చిక్కిన  పులి చిక్కింది. అయితే కెమెరా అలజడికి భయపడిన పులి అక్కడినుంచి పరుగులు తీసినట్లు అధికారులు గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాలవారు పులి ఎప్పుడు తమపై దాడి చేస్తుందేమోనని భయంతో వణికిపోతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget