అన్వేషించండి

Kurnool Crime News: కర్నూలులో మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన యువతి! రివెంజ్ కోసం దారుణం

Kurnool News | తనను ప్రేమించిన వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకున్నాడని కోపం పెంచుకుంది. మాజీ ప్రియుడి భార్యకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ఇచ్చి జైలుపాలైంది. కర్నులు నగరంలో ఘటన జరిగింది.

Kurnool Crime News: కర్నూలు నగరంలో అత్యంత దారుణమైన, విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకున్నాడన్న కక్షతో, ఓ యువతి తన మాజీ ప్రియుడి భార్యకు హెచ్‌ఐవీ (HIV) వైరస్‌ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడం కలకలం రేపుతోంది.  

అసలేం జరిగింది.. 
కర్నూలుకు చెందిన ఒక డాక్టర్, ఆదోనికి చెందిన ఒక యువతి కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. అయితే, ఏం జరిగిందో కానీ వారి ప్రేమ పెళ్లిపీటల వరకు వెళ్లకుండానే విడిపోయారు. ఆ తర్వాత ఆ డాక్టర్ మరో మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకున్నారు. బాధితురాలు కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

తమ ప్రేమ విఫలమవడానికి కారణమైన మాజీ ప్రియుడైన డాక్టర్, అతని భార్యపై పగ పెంచుకున్న యువతి, వారిని విడదీయాలని దారుణమైన కుట్ర పన్నింది. ఈ నెల 9వ తేదీన మహిళా డాక్టర్ డ్యూటీ పూర్తి చేసుకుని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా, నిందితురాలు నలుగురు వ్యక్తులతో కలిసి ఆమెను బైకుతో ఢీకొట్టి కిందపడేలా చేసింది. ప్రమాదానికి గురైన ఆమెకు సహాయం చేస్తున్నట్లు కొందరు వ్యక్తులు నటించారు. ఆటో ఎక్కించే క్రమంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్ (HIV) నింపిన ఇంజెక్షన్‌ను ఆమె శరీరంలోకి ఎక్కించారు.

ఈ ఘటనపై అనుమానం వచ్చిన బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాఫ్తు చేపట్టి నిందితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ ప్రియురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగలేదని, మరొకర్ని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయింది. ఆ డాక్టర్ జంట ఎలాగైనా విడిపోవాలని మాజీ ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ చేసింది. డబ్బు ఇచ్చి కొందరు వ్యక్తుల సహకారంతో ఆమె ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget