అన్వేషించండి

Sri Vadapalli Venkateswara Sawmi Temple: వాడపల్లిలో పవిత్రోత్సవాల ముగింపు: భక్తుల కోరికలు నెరవేర్చే వేడుకలు.. ప్రత్యేకతలివే!

కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభ‌వోపేతంగా ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తోన్నారు.ఆల‌య ప‌విత్ర‌త పున‌రుద్ధ‌ర‌ణ‌, ఆధ్యాత్మిక శాంతి, దైవానుగ్ర‌హంకోసం ఏటా నిర్వ‌హిస్తుంటారు.

Sri Vadapalli Venkateswara Sawmi Temple | కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభ‌వోపేతంగా ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఖండవల్లి రాజేశ్వర పరప్రసాదచార్యులు నేతృత్వంలో వైఖన ఆగమన శాస్త్రోక్తంగా పరమ పవిత్రమైన శ్రావణ శుద్ధ, దశమి, ఏకాదశి ద్వాదశి మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలు, ఋత్వికులు, వేద పండితులు దీక్షాధారణ చేసి, శాస్త్రోక్తంగా వేడుకలను ప్రారంభించ‌గా నేటితో ముగుస్తున్నాయి. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర రావు పర్యవేక్షణలో ఆయా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

పవిత్రోత్సవాలు ప్రాముఖ్య‌త ఇదే..

ఏడు వారాల వెంక‌న్న‌గా ప్ర‌సిద్ధి చెందిన వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలోని పవిత్రతను పునరుద్ధరించడమే కాక, భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, దైవానుగ్రహాన్ని ప్రసాదించేందుకు ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తుండ‌డం సంప్ర‌దాయం కాగా ఒక పవిత్రమైన వార్షిక ఉత్సవంగా వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌ర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని, స్వామివారి మూల‌విరాట్‌ను, పరిసరాలను శుద్ధి చేయడానికి, పవిత్రం చేయడానికి నిర్వహిస్తున్నారు..

ఆధ్యాత్మికం.. మూడు రోజుల ఉత్స‌వం.. 

వాడపల్లి ఆలయంలో పవిత్రోత్సవాల సంద‌ర్భంగా ఆలయం, స్వామి విగ్రహం శుద్ధి చేయడంతోపాటు ఈ కార్యక్రమంలో అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం, గోదావరి జలాలతో అభిషేకం వంటి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు.. ఈ శుద్ధి కార్యక్రమం ఆలయంలోని దైవిక శక్తిని పునరుద్ధరిస్తుందని, భక్తులకు సానుకూల శక్తిని అందిస్తుందని భక్తుల ప్ర‌గాఢ విశ్వాసం.. దీంతోపాటు పవిత్రోత్సవాల సమయంలో జరిగే వేద పారాయణాలు, అష్టోత్తర పూజలు మరియు నిత్య కల్యాణాలు భక్తులకు మానసిక శాంతిని, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తాయి. ఈ ఉత్సవాలు భక్తులను దైవ సాన్నిధ్యంతో ఆకర్షిస్తాయి. వారి కోరికలను నెరవేర్చేందుకు స్వామి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

ఇక వాడపల్లి ఆలయం ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామిని దర్శించడం ద్వారా కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ప్రసిద్ధి చెంద‌గా పవిత్రోత్సవాలు ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి, ఎందుకంటే ఈ సమయంలో జరిగే పూజలు శని దోష నివారణకు మరియు భక్తుల కోరికల నెరవేర్పుకు సహాయపడతాయని భావించ‌డంతో ఈస‌మ‌యంలో ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతున్నారు. పవిత్రోత్సవాల సమయంలో గోదావరి జలాలతో స్వామి విగ్రహానికి అభిషేకం చేయడం ఒక ప్రత్యేక ఆచారం కాగా ఈ జలాలు పవిత్రమైనవిగా  ఈ అభిషేకం ద్వారా స్వామి యొక్క దైవిక శక్తి మరింత ప్రకాశిస్తుందని నమ్ముతారు.

నేటితో పవిత్రోత్సవాల ముగింపు..

రెండు రోజుల పాటు వైభ‌వోపేతంగా నిర్వ‌హించిన వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప‌విత్రోత్స‌వాలు బుధ‌వారం రాత్రితో ముగియ‌నున్నాయి.. సోమవారం ఉదయం ఋత్వికులు దీక్షా ధారణతో ఉత్సవాలు ప్రారంభమై, రెండవ రోజు అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మూడోరోజు ప్ర‌త్యేక పూజ‌లు, అభిషేకాలుతో వైభ‌వోపేతంగా జ‌రుగ‌నుండ‌గా ఈ ఉత్సవాలు ఆలయంలో భక్తిమయ వాతావరణాన్ని సృష్టిస్తూ, భక్తులను ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద‌ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో  ఏటా జరిగే పవిత్రోత్సవాలు ఆలయ శుద్ధి, భక్తుల ఆధ్యాత్మిక శాంతి తోపాటు స్వామి యొక్క దైవిక అనుగ్రహాన్ని పొందేందుకు 
భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు.. 

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget