అన్వేషించండి

Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య

Bhimavaram News |వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భీమవరంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆటో డ్రైవర్ శ్యామ్‌బాబు మోసాన్ని గ్రహించి ఆమె దూరం పెట్టడంతో పగపెంచుకుని కత్తితో దాడి చేసి హతమార్చాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనంతవాణి ప్రేమోన్మాది శ్యామ్‌బాబు చేతిలో హత్య.
  • తల్లి అనారోగ్యంతో స్వగ్రామానికి వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తోంది.
  • శ్యామ్‌బాబుకు పెళ్లి కావడం తెలిసి దూరం పెట్టడంతో హత్య జరిగింది.
  • పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం గాలింపు చేపట్టారు.

భీమవరం: తల్లికి అనారోగ్యం కారణంగా స్వగ్రామంలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్న యువతి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయ్యారు. కుటుంబంలో సంపాదించే ఒక్కరు ఆమెనే కావడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన యువతి కొత్తపల్లి అనంతవాణి(32) హత్యకు గురైంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనంతవాణి, తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో గత ఏడాది స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఆమె తండ్రి దివ్యాంగుడు కాగా, తల్లి అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. అప్పటినుంచి ఆమె వర్క్‌ఫ్రం హోం చేస్తూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ తాడేపల్లి శ్యామ్‌బాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహమై, ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే, ప్రియుడు శ్యామ్‌బాబుకు గతంలోనే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆలస్యంగా తెలుసుకుంది. తాను మోసపోయానని గ్రహించి, అప్పటినుంచి శ్యాం బాబును  పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించారు.

దీంతో అనంతవాణిపై తీవ్ర పగ పెంచుకున్న శ్యామ్‌బాబు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అనంతవాణి నిద్రలేచి తలుపు తీయగా శ్యామ్‌బాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తిపోట్లతో తీవ్రరక్తస్రావం అయిన అనంతవాణిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం తరువాత అనంతవాణి మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఏఎస్సై వైవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కుటుంబానికి ఏకైక ఆధారం ఆమె..
అనంతవాణి ఆ కుటుంబానికి ఏకైక ఆర్థిక ఆధారంగా నిలిచారు. దీంతో ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతోనే తల్లిదండ్రులను పోషిస్తున్నారు. బ్యాంకు లోన్ తీసుకుని కుటుంబం కోసం ఇల్లు కట్టిందని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకే ఆమె హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారు. కుమార్తెపై దాడి చేసి చంపుతున్నా అడ్డుకునే పరిస్థితులో లేమని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని స్థానికులు చెప్పుకొచ్చారు. 

Frequently Asked Questions

హత్యకు గురైన యువతి ఎవరు, ఈ ఘటన ఎక్కడ జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొత్తపల్లి అనంతవాణి (32) హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆమె స్వగ్రామంలో జరిగింది.

అనంతవాణిని ఎవరు, ఎందుకు హత్య చేశారు?

తాడేపల్లి శ్యామ్‌బాబు అనే ఆటో డ్రైవర్ అనంతవాణిని హత్య చేశాడు. అతనికి పెళ్లయి పిల్లలు ఉన్నారని తెలుసుకున్న అనంతవాణి అతన్ని దూరం పెట్టడంతో పగ పెంచుకుని హత్యకు పాల్పడ్డాడు.

అనంతవాణి స్వగ్రామంలో ఉండటానికి గల కారణం ఏమిటి?

అనంతవాణి తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో ఆమె బాగోగులు చూసుకోవడానికి హైదరాబాద్ నుండి స్వగ్రామం తాడేరుకు వచ్చి వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి ఏకైక ఆర్థిక ఆధారం.

ఈ హత్య కేసులో పోలీసులు చేపట్టిన చర్యలు ఏమిటి?

అనంతవాణి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు శ్యామ్‌బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget