అన్వేషించండి

Crime News: పెళ్లి మండపం వద్ద హైడ్రామా- మొదటి భార్యతో వరుడు పరార్, ఆపై మరో ట్విస్ట్‌ !

మ‌రికొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా పెళ్లి పీట‌ల‌పై ఉండాల్సిన పెళ్లి కొడుకు ప‌రారైన సంఘ‌ట‌న తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగింది.

పెళ్లి మండపం వద్ద హైడ్రామా: పెళ్లి కొడుకు పరార్, షాకింగ్ నిజాలు.. యువతి జీవితం ప్రశ్నార్థకం!

పెళ్లి అంటే నూరేళ్ల పంట అనే మాట ఈ నాటిది కాదు.. మ‌నిషి జీవితంలో అత్యంత ముఖ్య‌మైన ఘ‌ట్టం పెళ్లి వేడుక‌.. దానికోసం అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో ఎదురు చూస్తుంటారు.. స‌రిగ్గా అలాగే క‌ల‌లు కంది ఓ యువ‌తి.. పెద్ద‌లు కుదిర్చిన వివాహంకు అంగీక‌రించిన వ‌ధువు మ‌రికొన్ని గంట‌ల్లో పెళ్లి మంట‌పానికి వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.. మ‌రో ప‌క్క పెళ్లి వేడుక‌కు వ‌చ్చిన బంధు మిత్రులు విందు ఆరగిస్తున్నారు.. మేళ‌తాళాలుతో ఆ ప్రాంతం అంతా సంద‌డి నెల‌కొంది.. తెల్ల‌వారు జామున పెళ్లి అవ్వ‌డంతో సాయంత్రం పూట పెట్టుకున్న భోజ‌నాలు పూర్త‌య్యాక అక్క‌డి నుంచి పెళ్లి మంట‌పానికి వెళ్లాల్సి ఉంది.. ఇంత‌లో షాకింగ్ న్యూస్ పెళ్లి కొడుకు బంధువుల నుంచి వ‌చ్చింది.. రెండు గంట‌ల నుంచి పెళ్లి కొడుకు క‌నిపించ‌డం లేదు.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వ‌స్తుందంటూ పెళ్లి ఇంట చావు క‌బురులా వినిపించారు..   నూరు అబద్దాలు అడైనా పెళ్లి జ‌రిపించాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు.. స‌రిగ్గా ఇలేనే ఆబ‌ద్దాలు ఆడి ఏదిఏమైనా పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడో ఏమో కానీ పెళ్లి కొడుకు అబ‌ద్దాల మీద అబ‌ద్దాలు ఆడి పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు.. అప్ప‌టికే  భ‌ర్త చ‌నిపోయిన ఓ మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడ‌ని, తీరా ఆమె బెదిరించ‌డంతో భ‌య‌ప‌డి పారిపోయాడ‌న్న విష‌యం తెలుసుకుని  షాక్‌కు గుర‌వ్వ‌డం పెళ్లి కూతురు బంధువుల వంత‌య్యింది..  

తూర్పు గోదావ‌రి జిల్లా గోపాల‌పురం మండ‌లం భీమోలుకు చెందిన యువ‌తికి, దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం యాద‌వోలుకు చెందిన పాలి మూల‌స్వామి, వెంక‌ట‌దుర్గ కుమారుడు పాలి వీర‌వెంక‌ట నాగ స‌త్య‌నారాయ‌ణ‌తో వివాహ‌ సంబందం కుదిరింది. ఈ క్ర‌మంలోనే ఇరు ప‌క్షాల బంధువులు అన్ని లాంఛ‌నాలు మాట్లాడుకుని  ఆగ‌స్టు 12న  తెల్ల‌వారితే 13 వ తేదీ 3 గంట‌ల‌కు వివాహం జ‌రిపించాల‌ని నిశ్ఛ‌యించుకున్నారు. ఇందుకోసం వ‌ధువు స్వ‌గ్రామం అయిన భీమోలులో 12వ తేదీ రాత్రి సుమారు 1500 మంది హాజ‌ర‌య్యేలా ఎస్టిమేష‌న్ వేసుకుని విందు ఏర్పాటు చేసుకున్నారు.. తెల్ల‌వారు జామున వ‌రుడు స్వ‌గ్రామంలో వివాహం జ‌ర‌గాల్సి ఉండ‌గా వ‌ధువును అక్క‌డికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.. మ‌రికొద్ది నిముషాల్లో వ‌ధువు బ‌య‌లు దేరేందుకు సిద్ధం అవుతుండ‌గా వ‌రుడు ఇంటి వ‌ద్ద పెళ్లి మండ‌పం వ‌ద్ద తీవ్ర గంద‌ర‌గోళం మొద‌లయ్యింది.. 

పెళ్లి కొడుకు క‌నిపించ‌డం లేదంటూ స‌మాచారం..

మ‌రికొద్ది నిముషాల్లో వ‌ధువు పెళ్లి కుమారుడు నాగ‌స‌త్య‌నారాయ‌ణ ఇంటికి బ‌య‌లు దేరేందుకు సిద్ధం అవుతుండ‌గా పెళ్లి కొడుకు క‌నిపించ‌డం లేదంటూ వ‌ధువు ఇంటివారికి స‌మాచారం అందింది.. సుమారు రెండు గంట‌ల నుంచి పెళ్లి కోడుకు  నాగ స‌త్య‌నారాయ‌ణ క‌నిపించ‌డం లేద‌ని, వెతికినా ఎక్క‌డా లేడ‌ని, అత‌ని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వ‌స్తోంద‌ని వ‌రుడి బంధువులు తెలిపారు. దీంతో  వ‌ధువు కుటుంబికులు, బంధువులు పెళ్లి కొడుకు కుటింబికుల‌ను నిల‌దీశారు..

ఒంట‌రి మ‌హిళ‌ను వివాహం చేసుకుని.. ఆపై మళ్లీ పెళ్లికి..

ఎర్న‌గూడెం గ్రామానికి చెందిన భ‌ర్త చ‌నిపోయిన ఓ మ‌హిళ‌తో  నాగ స‌త్య‌నారాయ‌ణ‌కు అయిదేళ్ల క్రితం వివాహం అయ్యిందని ఆమెతో ఉంటున్నాడ‌ని తెలిసింది. పైగా  ఆమె కుమార్తెకు కూడా స‌త్య‌నారాయణ‌ వివాహం జ‌రిపించాడ‌ని తేలింది.. ఈ నేప‌థ్యంలోనే ఆ మ‌హిళ బెదిరించ‌డంతో మ‌రికొన్ని గంట‌ల్లో వివాహం ఉండ‌గా పారిపోయాడ‌ని వ‌ధువు బంధువులుకు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన వ‌ధువు కుటుంబికులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు..

నిత్య‌పెళ్లి కొడుకును అరెస్ట్ చేయాల‌ని డిమాండ్‌..

త‌న‌కు అప్ప‌టికే పెళ్ల‌య్యి మ‌రో యువ‌తి జీవితాన్ని నాశ‌నం చేయ‌డ‌మే కాకుండా పెళ్లి పేరుతో ప‌రువును, ఆర్దీకంగా న‌ష్టం క‌లిగేలా మోసం చేసిన పాలి వీర‌వెంక‌ట నాగ స‌త్య‌నారాయ‌ణ‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వ‌ధువు కుటుంబికులు డిమాండ్ చేశారు. ఈక్ర‌మంలోనే నిందితున్ని అరెస్ట్ చేయాల‌ని దేవ‌ర‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. పీట‌ల మీద పెళ్లి ఆగిపోవ‌డంతో పెళ్లి కూతురు త‌న జీవితం నాశ‌నం అయ్యింద‌ని తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంద‌ని, ఆమె ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోన‌న్న భ‌యంతో ఇంటి దగ్గ‌ర కాప‌లా పెట్టి పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చామ‌ని వ‌ధువు బంధువులు తెలిపారు. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న స‌త్య‌నారాయ‌ణ మ‌రో యువ‌తి జీవితాన్ని నాశ‌నం చేయాల‌ని చూశాడ‌ని, అటువంటి వ్య‌క్తిని చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తుండ‌గా చ‌ట్ట‌ప్ర‌కారం ఎంత వ‌ర‌కు న్యాయం చేయాలో అలా చేస్తామ‌ని దేవ‌ర‌ప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర‌నాయ‌క్ వారికి హామీ ఇచ్చారు..

 

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Embed widget