Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
అవకాశం దొరకాలే గానీ దేవుడి పేరు మీద కూడా స్కామ్స్ చేయడానికి వెనుకాడడం లేదు కేటుగాళ్ళు. తాజాగా చిన్న తిరుపతిగా పేర్కొనే ద్వారకా తిరుమల లో స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లతో భక్తులను బురిడీ కొట్టించిన మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు ఏలూరు జిల్లా పోలీసులు.వాళ్లలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఉండడం స్థానికం గా సంచలనం సృష్టించింది.

అవకాశం దొరకాలే గానీ దేవుడి పేరు మీద కూడా స్కామ్స్ చేయడానికి వెనుకాడడం లేదు కేటుగాళ్ళు. తాజాగా చిన్న తిరుపతిగా పేర్కొనే ద్వారకా తిరుమల లో స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లతో భక్తులను బురిడీ కొట్టించిన మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. వాళ్లలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఉండడం స్థానికం గా సంచలనం సృష్టించింది.
తాడేపల్లిగూడెం కేంద్రంగా నకిలీ దర్శనం టికెట్స్ రాకెట్
ఏలూరు జిల్లా పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 15వ తారీఖున ద్వారకా తిరుమల లో స్కానింగ్ కౌంటర్ వద్ద కొంతమంది భక్తుల టికెట్స్ స్కాన్ కాలేదు. పరిశీలించి చూడగా అవన్నీ నకిలీ వని తేలింది. దీనిపై ద్వారకాతిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భద్రాజీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో విచారణ చేపట్టారు. ముందుగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత మరికొందరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆ సంఖ్య ఏడుకు చేరింది. నిందితులు ఇచ్చిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెంలో ఈ నకిలీ టికెట్స్ ప్రింట్ చేస్తున్న ఒక షాప్ ను రైడ్ చేసి ఒక లాప్ టాప్, 200రూపాయల ఫేక్ టికెట్స్,మరికొన్ని ప్రింటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
స్కామ్ లో ఆలయ సిబ్బంది పాత్ర
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారిలో నాగ వెంకట సత్య శ్రీనివాస్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్,మానుకొండ ఆంజనేయులు అనే ఆలయ సెక్యూరిటీ సూపర్వైజర్,కీర్తి అశోక్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్,ఇన్నంపూడి సాయి జగన్నాథ్ రాజు,ములగాల రమేష్,తొంటపాక సత్యనారాయణ,ఉప్పలపాటి శ్రీనివాస్ అనే ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ దర్శనం టికెట్లు ముద్రిస్తూ అటు భక్తులను ఇటు దేవాలయ యాజమాన్యాన్ని మోసం చేస్తూ స్కామ్ కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ స్కాం ఎంత కాలం నుంచి చేస్తున్నారు ఎంత డబ్బు పోగేసారు అనే దానిపై పోలీసు విచారణ జరుగుతోంది. కానీ ఆలయ సిబ్బంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు కలిపి దేవుడి దర్శనం టికెట్లనే స్కామ్ చేయడం అనేది ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించింది.
ట్రెండింగ్ వార్తలు






















