అన్వేషించండి

Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం

సెలవుల్లో గ్రామానికి వచ్చిన ఫ్రెండ్‌తో కలిసి ముగ్గురు బాలికలు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మలుంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది.

Malungummi Waterfall | హుకుంపేట: సెల్ఫీ సరదా ముగ్గురు టీనేజ్ బాలికల ప్రాణాలు బలిగొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం నాడు ఈ విషాదం నెలకొంది. సెలవుల్లో సరదాగా గడుపుదామని వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లిన నలుగురు స్నేహితురాళ్లలో ముగ్గురు సెల్ఫీ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. హుకుంపేట మండలం జంబువలస గ్రామానికి చెందిన సాలేపు త్రిష (17), సాలేపు పవిత్ర (16), సాలేపు రత్నకుమారి (16), అంజలి అనే నలుగురు బాలికలు గురువారం సాయంత్రం అనంతగిరి మండలం మలుంగుమ్మి వాటర్‌ఫాల్స్ సందర్శనకు వెళ్లారు.

ప్రాణాలు తీసిన సెల్ఫీలు..

మొదటవారు మలుంగుమ్మి వాటర్ ఫాల్స్ వద్ద కొండ అంచున నిలబడి సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపారు. వేసవికాలం కావడంతో నీళ్లలో సరదాగా సమయం గడుపుతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. గట్టున ఉన్న స్నేహితురాలు ఫొటోలు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ఒకరు జారి నీటిలో పడిపోగా, ఆమెను కాపాడబోయి మిగతా ముగ్గురు కూడా ఒకరి వెనుక ఒకరు జలపాతంలోకి జారిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే నీళ్లలోకి దిగి వారిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే త్రిష, రత్నకుమారి, పవిత్ర ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.  మొదట గట్టున ఉండి, చివర్లో నీళ్లలోకి దిగినట్లు భావిస్తున్న అంజలి గాయాలతో ప్రాణాలతో బయటపడింది.

మృతుల్లో త్రిష ఇంటర్ పరీక్షలు రాసి సెలవులకు గ్రామానికి వచ్చింది. పవిత్ర, రత్నకుమారి పదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. మరణించిన ముగ్గురు బాలికలు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమార్తెలు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు నీళ్లలో సరదాగా కేరింతలు కొట్టిన బాలికలు ఇక ప్రాణాలతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

జలాశయాల వద్ద జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమే..

ప్రమాదకర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకుంటూ యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని అప్రమత్తం చేశారు. ఈత రాని వారు నీటి ఒడ్డున ఉండాలి కానీ లోతు ఎక్కువగా ఉన్న చోట జలాశయాల్లోకి దిగడం ప్రాణాలకు ప్రమాదమని పేర్కొన్నారు. నీళ్లలోకి దిగేటప్పుడు మునిగిపోకుండా ఉండేందుకు ట్యూబ్ లాంటివి వెంట తెచ్చుకోవడం మంచిదని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయని, వేసవికాలం కావడంతో బావులు, చెరువులు, వాటర్ ఫాల్స్ వద్ద మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Telangana News : జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
Vanasthalipuram accident: తాగి రోడ్డెక్కిన వాళ్ల తప్పు - రెండు నిండు జీవితాలు బలి - హస్తీనాపురం ప్రమాదంలో చీకటి కోణాలు
తాగి రోడ్డెక్కిన వాళ్ల తప్పు - రెండు నిండు జీవితాలు బలి - హస్తీనాపురం ప్రమాదంలో చీకటి కోణాలు
Advertisement

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa tears: వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స - అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం
వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స - అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం
IPL 2026 KKR VS LSG Result Update: ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. లక్నో సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. LSG సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
US-Iran Conflict: ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Embed widget