అన్వేషించండి

Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!

Cheap Liquor Mixed In Costly Bottles: ఇంట్లోనే మద్యం తయారు చేసిఅది ప్రముఖ బ్రాండ్ అని చెప్పి అమ్మేస్తున్నారు ఓ ముఠా. ఎక్సైజ్ అధికారుల దాడుల్లో ఈ ముఠా పట్టుబడింది.


Spurious Liquor Manufacturing At Home Hyderabad: హైదరాబాద్ మహానగరంలో యూట్యూబ్‌ను చూసి ఇంట్లోనే అక్రమంగా మద్యం, వైన్ తయారు చేస్తూ, వాటిని ప్రముఖ ఖరీదైన బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్న ఒక ముఠా ఉదంతం బుధవారం వెలుగులోకి వచ్చింది. సాంకేతికతను మంచి కోసం కాకుండా, అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు వాడుకున్న ఈ ముఠాను హైదరాబాద్ ఎక్సైజ్ ,  టాస్క్‌ఫోర్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా నకిలీ మద్యం, వివిధ రకాల బ్రాండ్ల ఖాళీ సీసాలు, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.

  నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో యూట్యూబ్‌లో లభించే వివిధ రకాల హోమ్ మేడ్ వైన్ ,  లిక్కర్ మేకింగ్ ట్యుటోరియల్స్  ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంట్లోనే కెమికల్స్, స్పిరిట్, ఇతర రంగులు, ఫ్లేవర్లను ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా మద్యం తయారు చేయడం ప్రారంభించారు. ఇలా స్థానికంగా తయారు చేసిన నకిలీ, కల్తీ మద్యాన్ని సాధారణ బ్రాండ్లలా కాకుండా మార్కెట్లో విక్రయించే ఖరీదైన విదేశీ, ప్రీమియం బ్రాండ్ల సీసాలలో నింపడం అలవాటు చేసుకున్నారు.  ఈ ముఠా తాము తయారు చేసిన నకిలీ మద్యాన్ని అసలైన బ్రాండ్ల కంటే కాస్త తక్కువ ధరకు ఇస్తామంటూ ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను, యువతను టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది. బార్లలో పారేసిన ఖరీదైన ఖాళీ సీసాలను సేకరించి ఈ మోసానికి పాల్పడేవారని అధికారులు తెలిపారు. 

ఈ వ్యవహారంపై ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు అందిన రహస్య సమాచారంతో బుధవారం నగరంలోని పలు ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిందితులు సాగిస్తున్న నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలైంది. ల్యాబ్ లాంటి సెటప్‌తో కెమికల్స్ మిక్స్ చేస్తున్న దృశ్యాలను చూసి అధికారులే షాకయ్యారు. మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ సృష్టించి, ఒరిజినల్ బాటిళ్లను పోలినట్లుగా ఉండే సీల్స్, నకిలీ హోలోగ్రామ్‌లను కూడా వీరు సిద్ధం చేసుకున్నట్లు గుర్తించారు. 

ఈ దాడుల్లో  లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యం, తయారీ పరికరాలు, కల్తీ కెమికల్స్‌ను సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ కల్తీ మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతినడంతో పాటు ప్రాణాలకే ప్రమాదమని, తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ మద్యం కొనుగోలు చేసి మోసపోవద్దని, సమాచారం ఉంటే అధికారులకు తెలపాలని మందుబాబులను హెచ్చరించారు.

 

 

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget