అన్వేషించండి

Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

Vizag Chain Snatching: అప్పుల బాధల నుంచి గట్టెక్కేందుకు సులువుగా డబ్బు సంపాదించడం ఎలా అని వెతికిన ఒక ఇల్లాలు.. చివరకు కొడుకుతో కలిసి చైన్ స్నాచర్‌గా మారింది. చివరికి ఇద్దరూ పోలీసులకు చిక్కారు.

Visakhapatnam Chain Snatching Mother Son Arrested:   ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి గట్టెక్కడానికి సాధారణంగా ఎవరైనా కష్టపడి పనిచేయడమో లేదా తెలిసిన వారి సహాయం కోరడమో చేస్తారు. కానీ, విశాఖపట్నానికి చెందిన ఒక ఇల్లాలు మాత్రం అడ్డదారి తొక్కింది. అప్పుల ఊబి నుంచి బయటపడటానికి మార్గం కనిపించక మొదట ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమె.. చివరి నిమిషంలో స్మార్ట్‌ఫోన్ తీసి యూట్యూబ్  ఓపెన్ చేసింది. అక్కడ కనిపించిన ఒక క్రైమ్ ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది. విలాసవంతమైన జీవితంపై ఉన్న మోజుతో, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కన్న కొడుకును సైతం నేరస్తుడిగా మార్చింది. చివరకు పక్కా ప్లాన్‌తో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలైంది.

విలాసాల కోసం అప్పుల పాలైన మహిళ

 విశాఖపట్నంలోని రామా టాకీస్ ప్రాంతంలో మాదివాడ ధనలక్ష్మి, ఆమె భర్త గోపికృష్ణ, కుమారుడు అక్షిత్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త గోపీకృష్ణ ప్రైవేట్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగంలో వచ్చే పరిమిత ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉన్నా.. ధనలక్ష్మికి మాత్రం విలాసవంతమైన జీవితం గడపాలనే కోరిక బలంగా ఉండేది. ఈ క్రమంలోనే ఆమె పరిచయస్తుల నుంచి భారీగా చిట్టీలు వేయించింది. అయితే వాటి నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. దానికి తోడు ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నెలవారీ ఈఎంఐ  కట్టలేక అప్పుల్లో మునిగిపోయింది. అప్పు ఇచ్చిన వారు రోజువారీగా ఇంటి చుట్టూ తిరుగుతూ ఒత్తిడి చేయడంతో, ఆ అవమానాన్ని భరించలేక భర్త గోపీకృష్ణ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఇంట్లో ఒంటరిగా మిగిలిన ధనలక్ష్మి మానసికంగా కుంగిపోయింది.
  
 యూట్యూబ్‌లో  ఈజీ మనీ  సెర్చ్

ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలాగైనా బయటపడాలని ధనలక్ష్మి యూట్యూబ్‌లో  How to earn money fast  అని సెర్చ్ చేసింది. ఆ క్రమంలో ఆమెకు చైన్ స్నాచింగ్ ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే క్రైమ్ వీడియోలు కనిపించాయి. దాంతో ఆమె మనసు నేరం వైపు మళ్లింది. 
యూట్యూబ్ చూసి దొంగతనం చేయాలని ఫిక్స్ అయిన ధనలక్ష్మి.. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు అక్షిత్‌ను ఇందుకు వాడుకోవాలని చూసింది. మొదట నిరాకరించినప్పటికీ, తల్లి తీవ్రంగా బలవంతం చేయడంతో అక్షిత్ కూడా ఈ చైన్ స్నాచింగ్ ప్లాన్‌కు ఒప్పుకున్నాడు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా, ఎక్కడా దొరకకూడదని తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి పక్కా వ్యూహం రచించారు. దొంగతనానికి ఉపయోగించే ద్విచక్ర వాహనం వెనుక వైపు ఉన్న నంబర్ ప్లేట్‌ను పూర్తిగా తొలగించారు. ముందు భాగంలో ఉన్న నంబర్ కనిపించకుండా దానికి ఒక రిబ్బన్ కట్టారు. ఇక గుర్తింపు దొరకకుండా ఉండేందుకు కొడుకు అక్షిత్ తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించగా.. తల్లి ధనలక్ష్మి తన ముఖాన్ని చున్నీతో పూర్తిగా కప్పేసుకుంది.

మొదటి స్నాచింగ్ లోనేదొరికిపోయారు !  

ఈ పక్కా స్కెచ్‌తో గత నెల 27వ తేదీ సాయంత్రం ఇద్దరూ కలిసి పెందుర్తి సుజాతనగర్ పరిధిలో బైక్‌పై తిరుగుతూ ఒంటరి మహిళల కోసం వేట ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న కిలపర్తి చెల్లయ్యమ్మ అనే వృద్ధురాలిని టార్గెట్ చేశారు. ఆమె దగ్గరకు వెళ్లి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ నమ్మబలికారు. వృద్ధురాలు అడ్రస్ చెప్తుండగా.. ఒక్కసారిగా ఆమె మెడలోని 5 తులాల బంగారు నల్లపూసల దండ, పుస్తెలతాడును అత్యంత వేగంగా తెంచుకుని బైక్‌పై దూసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెందుర్తి నేర విభావం, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. నిందితులు సీసీ కెమెరాలకు చిక్కకుండా తెలివిగా తిరిగినప్పటికీ.. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బైక్ ప్రయాణించిన దారిని క్షుణ్ణంగా ట్రేస్ చేసిన పోలీసులు, స్వల్ప వ్యవధిలోనే ధనలక్ష్మి, అక్షిత్‌లను గుర్తించి అరెస్ట్ చేశారు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకుని, ప్రస్తుతం ఆ తల్లి కొడుకులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget