అన్వేషించండి

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్! రిమాండ్‌కు ఆరుగురు నిందితులు 

ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసిన 296 కిలోల రాగి తీగలు, బొలెరో మ్యాక్స్ పికప్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పలువురు స్క్రాప్ డీలర్లు చోరీ సొత్తును అక్రమంగా విక్రయించినట్లు తేలింది.

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ సొత్తును కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.55 లక్షల విలువైన 296 కిలోల రాగి తీగలు, ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు. 

ఆదివారం విశ్వసనీయ సమాచారం మేరకు మావల పోలీసులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్, పిట్టలవాడ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతుంది. దీన్ని ఆపి తనిఖీ చేయగా, ఇనుప స్క్రాప్‌తోపాటు 17 సంచుల్లో 296 కిలోల రాగి తీగలు లభ్యమయ్యాయి. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.3.55 లక్షలుగా గుర్తించారు. 

పోలీసులు తమ స్టైల్‌లో విచారిస్తే ప్రధాన నిందితుడు షేక్ అయ్యూబ్ అసలు సంగతి చెప్పాడు. చోరీకి గురైన రాగి తీగలను కొనుగోలు చేసి నిజామాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. అతనికి షేక్ అమర్ సహకరిస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే దాస్నాపూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారులు మొహమ్మద్ అబ్దుల్ మతీన్ @ సౌఫిక్, మొహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్, పంజేషా మహల్లాకు చెందిన మొహమ్మద్ జావేద్, మొహమ్మద్ ఫైజ్ ఉద్దీన్ చోరీ సొత్తుగా అనుమానిస్తున్న రాగి తీగలను విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు.

1. షేక్ అయ్యూబ్, నిజామాబాద్
2. షేక్ అమర్
3. మొహమ్మద్ అబ్దుల్ మతీన్ @ సౌఫిక్, దాస్నాపూర్
4. మొహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్, పిట్టలవాడ రోడ్, దాస్నాపూర్
5. మొహమ్మద్ జావేద్, పంజేషా మహల్లా
6. మొహమ్మద్ ఫైజ్ ఉద్దీన్, పంజేషా మహల్లా

ఈ నిందితుల వద్ద నుంచి ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, 17 సంచుల్లో 296 కిలోల రాగి తీగలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.

Frequently Asked Questions

ఈ రాగి తీగలు ఎక్కడ లభ్యమయ్యాయి?

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్, పిట్టలవాడ ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బొలెరో వాహనంలో ఈ రాగి తీగలు లభ్యమయ్యాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget