అన్వేషించండి

Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!

Vizag Fishermen Missing:విశాఖ తీరంలో వారం రోజుల క్రితం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. ఆచూకీ లభించని వారంతా చనిపోయినట్టు అందులో పేర్కొంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విశాఖలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు ప్రమాదం.
  • ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఆరుగురు గల్లంతై మరణించారు.
  • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ₹10 లక్షల సాయం ప్రకటించింది.

Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో వారం రోజుల క్రితం ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేట పూర్తి అయిన తర్వాత వస్తున్న క్రమంలో వారి బోటు ప్రమాదానికి గురైంది. అంతే అందులో ఒక వ్యక్తి ఈదుకుంటూ విదేశ నౌకను పట్టుకొని బయటపడ్డాడు. మిగతా ఆరుగురు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం నాలుగు రోజులుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వారంతా చనిపోయినట్టు గుర్తించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

విశాఖ తీరంలో వేటకు వెళ్లి గల్లంతైన వారి ఉదంతం విషాదంతో ముగిసింది. జులై 1న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. వేట పూర్తి అయిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు దారుణంగా మారాయి. ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మరికాసేపట్లో ఒడ్డుకు వచ్చేస్తున్నామని సమాచారం ఇచ్చారు. అయితే వాతావరణం బాగాలేదని కూడా వారి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన కాసేపటి తర్వాత వారి ఫోన్లు పని చేయడం మానేశాయి.

Image

వాతావరణ పరిస్థితులు కారణంగా వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఆ ఏడుగురు ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా సమయం బోటుపై ఉండేందుకు యత్నించారు. కానీ అది పూర్తిగా మునిగిపోవడంతో తప్పనిసరిగా ప్రాణాలు కాపాడుకునేందుకు ఈదాల్సి వచ్చింది. రాత్రంతా వారు ఈదుతూనే ఉన్నారు. అయితే అందులో ఒకరు మాత్రం నడిసంద్రంలో ఉన్న ఒక ఓడను చూశాడు. అతను అతికష్టమ్మీద ఆ ఓడ వద్దకు చేరుకున్నాడు. నౌకాసిబ్బంది అతన్ని రక్షించి అధికారులకు సమాచారం అందించారు. అతనే కారీ చిన్న. 

Image

మిగతా వారు మాత్రం ఈద లేకపోయారు. దీంతో వారు గల్లంతయ్యారు. తనతో వచ్చిన ఆరుగురు ఆచూకీ లభించడం లేదని చిన్న చెప్పిన సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు వారి కోసం విస్తృతగా గాలింపు చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వారిని గుర్తించే పని చేపట్టారు. కానీ అది సాధ్యం కాలేదు. 

Image

చివరకు ముగ్గురు సభ్యులతో వేసిన కమిటీ రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసినట్టు తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గల్లంతైన వారంతా చనిపోయినట్టు అందులో పేర్కొంది. తమ వారు ప్రాణాలతో ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉంటారని ఎంతో ఆశగా ఎదురు చూసిన కుటుంబాలకు నిరాశ తప్పలేదు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే వారి కాళ్ల కింద భూమి కుంగిపోయింది.  ఒక్కసారిగా గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయిన తమను ఆదుకునేవారు ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

ఘోర విపత్తుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల సాయం ప్రకటించింది. మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే బాధితులకు అందజేయాలని ఆదేశించారు. ఈ ఉదయం మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ టైంలో అక్కడ కొందరు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి నచ్చజెప్పి బాధితులను పరామర్శించారు. వారి దుస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున కచ్చితంగా అందర్నీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

Frequently Asked Questions

విశాఖ తీరంలో మత్స్యకారులకు ఏం జరిగింది?

జులై 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. బంగాళాఖాతంలో వాతావరణం దారుణంగా మారడంతో వారి బోటు బోల్తా పడింది.

ఈ ఘటనలో ఎంతమంది మత్స్యకారులు గల్లంతయ్యారు?

ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారుల్లో కారీ చిన్న అనే వ్యక్తి ఒక విదేశీ నౌకను పట్టుకుని బయటపడ్డారు. మిగతా ఆరుగురు మత్స్యకారులు గల్లంతై చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించింది?

రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర బాధితులను పరామర్శించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ ఫలితాలు 2026 విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు పాస్!  
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ ఫలితాలు 2026 విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు పాస్!  
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Fishermen Boat Capsized: విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Embed widget