అన్వేషించండి

AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు

AP Rains | ఏపీలో మరో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని, కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ తెలిపారు. ఒకవైపు మేఘావృతమైన వాతావరణంతో కొన్ని జిల్లాల్లో వర్షం సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాయలసీమ నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది.

పిడుగుల ముప్పు - రైతులు, పశువుల కాపరులకు హెచ్చరిక
నేటి నుంచి రెండు రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా ఏపీలో వర్ష సూచన
మంగళవారం (07-04-2026) నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

దక్షిణ కోస్తా, రాయలసీమ‌లో ఇలా..
పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు పడని చోట ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

సోమవారం సాయంత్రం వరకు తూర్పు గోదావరి జిల్లాలోని లక్ష్మీపురంలో 57.5మిమీ, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో 52.5మిమీ, డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురంలో 52.5మిమీ, ఏలూరు జిల్లాలోని తదువైలో 47.5మిమీ, తూర్పు గోదావరి  జిల్లాలోని నిడదవోలులో 40.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.

నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు
మంగళవారం నాడు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గుడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో వడగాలులు ప్రభావం అధికంగా ఉండనుంది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

సోమవారం అనంతపురం జిల్లాలోని తెరన్నపల్లిలో 42°C, కడప  జిల్లాలోని రాజుపాలెంలో 41.9°C, మార్కాపురం జిల్లాలోని నందన మారెళ్లలో 40.7°C, నంద్యాల జిల్లాలోని పేరుసోమలలో 40.6°C, నెల్లూరు  జిల్లాలోని వరికుంటపాడులో 40.3°C, అన్నమయ్య జిల్లాలోని గోపిదిన్నెలో 40.1°C, కర్నూలు జిల్లాలోని తోవిలో 40°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget