అన్వేషించండి

Sri Reddy News: ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!

ప్ర‌ముఖ సినీ న‌టి శ్రీ‌రెడ్డిపై తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి శివారు బొమ్మూరు పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయ్యింది. టీడీపీ మ‌హిళానేత మ‌జ్జి ప‌ద్మ ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

AP Police filed case on Actress Sri Reddy | రాజమండ్రి: సోషల్‌ మీడియాను అడ్డంపెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై వరుస కేసుల నమోదు, అరెస్ట్‌లతో దూకుడు ప్రదర్శిస్తున్నారు ఏపీ పోలీసులు. గతంలో వైసీపీ తరపున సోషల్‌ మీడియాలో చెలరేగి పోస్టులు పెట్టినట్లు సినీ నటి శ్రీరెడ్డిపై కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితలపై సోషల్‌ మీడియా వేదికగా శ్రీరెడ్డి బూతు పురాణంపై తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసులకు ఫిర్యాదు అందింది.

టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటి శ్రీరెడ్డిపై బమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 బీఎస్‌ఎన్‌, 67 ఐటీఏ 2000`2008 సెక్షన్లు కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో శ్రీరెడ్డి సోషల్‌ మీడియా పోస్టులపై పలువురు ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, అందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం మద్దతే కారణమని పద్మ ఆరోపించారు. శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.  

కూటమి నేతలే లక్ష్యంగా వీడియోలు..

ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా శ్రీరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా విపరీతంగా పోస్టులు పెట్టారు. కూటమి నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి పలు వీడియోలు చేయగా ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌, వంగలపూడి అనితలతోపాటు మరికొందరు బీజేపీ నేతలే టార్గెట్‌ గా అసభ్య పదజాలంతో చెలరేగి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఉచ్చరించేందుకు కూడా సిగ్గుపడే భాషలో మాట్లాడిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  

కర్నూల్‌లోనూ కేసు నమోదు..

సినీ నటి కొందరిని టార్గెట్‌గా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని గతంలో కర్నూల్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఏడాది జూలై 20న కేసు నమోదయ్యింది. కూటమి ముఖ్యనేతలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ బీసీ సెల్‌ నాయకుడు నాగరాజు ఫిర్యాదు చేశారు. తాజాగా రాజమహేంద్రవరం బమ్మూరులో టీడీపీ మహిళా నేత మజ్జి శ్రీరెడ్డి ఆమె సోషల్‌ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యల క్లిప్పింగ్‌లతో సహా ఫిర్యాదు చేయగా శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: Andhra Pradesh News: సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న

క్షమించాలంటూ ఓ వీడియో...

సోషల్‌ మీడియా వేదికగా నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడిన వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిష్టులపై ఏపీ పోలీసులు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. చర్యలలో భాగంగా ఒక్కక్కరిని అరెస్ట్‌ చేస్తుండడంతో శ్రీరెడ్డి ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌, వంగలపూడి అనితలను క్షమాపణ కోరుతున్న శ్రీరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget