News
News
X

Rahul Gandhi: ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాందీ జోడో యాత్ర, మళ్లీ సాయంత్రం కర్ణాటకలోకి

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డీ హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోని మారెమ్మ దేవాలయం  వద్ద నుంచి యాత్ర ప్రారంభం అయింది.

FOLLOW US: 
 
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాందీ చేపట్టిన జోడో పాదయాత్ర నేడు కర్టాటక లో నుంచి ఆంద్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని డీ హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోని మారెమ్మ దేవాలయం  వద్ద నుంచి ఉదయం 7-30 నిమిషాలకు ప్రారంభమైంది. మాదన హళ్లి మీదుగా డీ హిరేహాల్ లో మారెమ్మ దేవాలయం వద్ద 11-30 లకు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అనంతరం డీహిరేహాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై ఓబుళాపురం గ్రామం మీదుగా సాయంత్రం 7 గంటలకు బళ్లారి జిల్లాలో కర్ణాటకలోకి రాహుల్ గాందీ జోడో పాదయాత్ర ఎంటర్ కానుంది.

18న మళ్లీ ఏపీలోకి ఎంట్రీ

ఇవాళ 12 కి.మీ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగనుంది. ఈ నెల 18వ  తేదీ నుండి రాహుల్ గాంధీ యాత్ర మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగనుంది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబులాపురం నుండి రాహుల్ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించి, మళ్లీ ఇదే రోజు సాయంత్రానికి కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.

ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, తులసీరెడ్డి వంటి నేతలు రాహుల్ యాత్రకు ఘనంగా స్వాగతం  పలికారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాజకీయాలకు మూడేళ్లుగా రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన స్వగ్రామం నీలకంఠాపురంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆయన ఉన్నారు.

News Reels

23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర

భారత్‌ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్‌ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్‌ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది. 

మళ్లీ ఈ నెల 26 నుంచి మక్తల్‌లో తిరిగి రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.  అయితే, రాహుల్ గాంధీ తెలంగాణలోకి ప్రవేశించాక, యాత్ర కొనసాగాల్సిన రూట్‌ మ్యాప్‌పై కూడా సమీక్ష జరిగింది. టీపీసీసీ కీలక నేతలు శనివారం గాంధీ భవన్‌లో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ పర్యవేక్షకులు బైజు, సుశాంత్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల సందర్శన

తెలంగాణలో ప్రముఖ దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. అందులో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని ద‌ర్శించుకొని స్వామి ఆశీస్సులు రాహుల్‌ పొంద‌నున్నట్లు తెలుతస్తోంది. త‌ర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెద‌క్ చ‌ర్చికి వెళ్తారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న జ‌హంగీర్ ద‌ర్గాను కూడా సంద‌ర్శిస్తార‌ని భార‌త్ జోడో యాత్ర వ‌ర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా మ‌త విభ‌జ‌న రాజ‌కీయాల‌కు గట్టి సమాధానం ఇచ్చిన‌ట్టువుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది.

Published at : 14 Oct 2022 09:14 AM (IST) Tags: ANDHRA PRADESH Anantapur news Rahul gandhi bharat jodo yatra Obulapuram

సంబంధిత కథనాలు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు

Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు

టాప్ స్టోరీస్

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

KTR Vs Bandi Sanjay : కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !

KTR Vs Bandi Sanjay :  కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !