RRR : "జగన్ బెయిల్ రద్దు" తీర్పుపై నమ్మకం లేదు.. హైకోర్టులో రఘురామ లంచ్ మోషన్ పిటిషన్ !
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న తన పిటిషన్‌పై తీర్పు వచ్చే ఒక్క రోజు ముందు రఘురామకృష్ణరాజు ట్విస్ట్ ఇచ్చారు. జగన్ మీడియాచేసిన ప్రచారం వల్ల తీర్పుపై నమ్మకం లేదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని విచారణ బెంచ్‌ను మార్చాలని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థల్లో తీర్పు గురించి ముందుగానే ప్రచారం జరగడాన్ని చూపించారు. ఇలా ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థలు తీర్పును ప్రభావితం చేస్తున్నాయని అందుకే విచారణను ప్రత్యేక బెంచ్‌కు మార్చాలని కోరారు. Also Read : లీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ
జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. ఆగస్టు 25వ తేదీన తీర్పు చెబుతామని సీబీఐ కోర్టు చెప్పింది. అయితే ఆ రోజున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలతో సమయం ముగిసిపోవడం, తీర్పు కాపీ ఇంకా రెడీకాకపోవడంతో రెండు పిటిషన్లపై సెప్టెంబర్ 15వ తేదీన తీర్పు చెబుతామని న్యాయమూర్తి ప్రకటించారు. అయితే ఆగస్టు 25వ తేదీన తీర్పు రాక ముందే జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాలో " పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి " అని తీర్పును ప్రకటించారు. Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల గొడవ ! ఇంతకీ ఎవరికి ఎవరు బాకీ ఉన్నారు !?
ఆగస్టు 25వ తేదీన ఉదయం సీబీఐ కోర్టు సమయం ప్రారంభం కాగానే సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పిటిషన్‌ను సీబీఐ న్యాయమూర్తి కొట్టి వేశారని బెయిల్ షరతులు ఉల్లంఘించలేదన్న జగన్ తరపు న్యాయవాది వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారని ట్వీట్ చేశారు. అప్పటికి తీర్పు చెప్పలేదు. గంట తర్వాత ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ట్వీట్‌ను తొలగించారు. సమాచారలోపం వల్ల ఆ ట్వీట్ చేశామని వెంటనే తొలగించామని పొరపాటుకు చింతిస్తున్నామని సవరణ ప్రకటించారు. Also Read : రైతు కోసం తెలుగుదేశం పేరిట టీడీపీ ఆందోళనలు
అయితే ఇలా చేయడం ఖచ్చితంగా కోర్టు ధిక్కరణేనని ఆరోపిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో పిటిషన్‌ను సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. ఆ అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణకు సాక్షి మీడియా ఎడిటర్ వర్ధెల్లి మురళి, ఆ మీడియా గ్రూప్ సీఈవో కూడా కోర్టుకు హాజరవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తాము అలా ప్రకటించలేదని ఉద్యోగి తప్పిదం వల్ల జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో తీర్పు విషయంలో తనకు నమ్మకం లేదని రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది. Also Read : అదాని - జగన్ సీక్రెట్ మీటింగ్ గురించి తెలియదన్న మంత్రి మేకపాటి !