అన్వేషించండి

Adani Jagan : అదాని - జగన్ సీక్రెట్ మీటింగ్ గురించి తెలియదన్న మంత్రి మేకపాటి !

ఆదివారం అదానీ సోదరులు ఏపీ సీఎం జగన్ ను కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం తనకు తెలియదని పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి చెబుతున్నారు.

 

దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలైన అదానీ సోదరులు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదివారం సీక్రెట్‌గా వచ్చి కలిశారన్న ప్రచారం మీడియాలో జరుగుతోంది. అది వ్యక్తిగత పర్యటన కాబట్టి అధికారికంగా ప్రకటించలేదని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో అసలు నిజమేంటో తెలియదు. అందుకే మీడియా అంతా ప్రెస్‌మీట్ పెట్టిన పరిశ్రమ మంత్రి గౌతం రెడ్డినే అడిగింది. స్కిల్ యూనివర్శిటీల మీద జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి గౌతంరెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత సమీక్ష వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన వివరాలన్నీ చెప్పిన తర్వాత  మీడియా ప్రతినిధులు గౌతం అదానీ సోదరులు వచ్చి జగన్‌తో భేటీ కావడంపై ప్రశ్నించారు. Also Read : కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు!

అయితే గౌతం రెడ్డి  ఈ వార్తలను ఖండించలేదు. అలా  ఎవరూ వచ్చి సమావేశం కాలేదని చెప్పలేదు. కానీ ఆ విషయం తనకు తెలియదని మాత్రం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ మంత్రిగా గౌతం రెడ్డి ఉన్నారు. బడా పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముఖ్యమంత్రితో సమావేశానికి వస్తే ఖచ్చితంగా పరిశ్రమ మంత్రి కూడా ఉంటారు. ఏదైనా ఆయన శాఖ ద్వారా జరుగుతుంది కాబట్టి సమావేశాల్లో  ఆ మంత్రి ఉండేలా చేస్తారు. అలా లేకపోయినా కనీసం ప్రోటోకాల్ ప్రకారమైనా పిలుస్తారు. కానీ మంత్రి గౌతంరెడ్డి అసలు అలాంటి సమావేశం జరిగిందో లేదో తెలియదు. జరగలేదని ఖండించలేదు కాబట్టి గౌతంరెడ్డి తనకు తెలియదని చెప్పినట్లుగా భావిస్తున్నారు. Also Read : "స్కిల్" స్టేట్‌గా ఏపీ... యూనివర్శిటీ, కాలేజీల ఏర్పాటుకు కీలక నిర్ణయాలు !

అయితే అదానీ సోదరులు సీఎం జగన్ తో సమావేశం కావడం అన్న అంశం చర్చనీయాశం కావడానికి టైమింగ్ కూడా ఓ కారణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు ప్రధానమైన పోర్టులు కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పోర్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ రెండు కొనుగోళ్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషరన్లు ప్రొప్రయిట్రీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణపట్నం విషయంలో కాకపోయినా గంగవరం పోర్టు విషయంలో ఈ ఆడిట్ కీలకంగా మారనుంది. 10.4శాతం ఉన్న ప్రభుత్వ వాటాను అతి తక్కువకే అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. Also Read : కలెక్టర్ దగ్గరికి కారం, కత్తి, నకిలీ తుపాకీతో వచ్చిన వ్యక్తి.. పోలీసులు షాక్!

ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై వాదనలో ఏపీ ప్రభుత్వం అధికారులు నివేదిక ఇచ్చినందునే అమ్మామని ప్రభుత్వం వాదిస్తోంది. అమ్మదల్చుకుంటే అంతర్జాతీయంగా టెండర్లు పిలవాలని అంటున్నారు. ఈ పిటిషన్లు దాఖలైన సమయంలో అదాని సోదరులు వచ్చి జగన్‌ను కలవడం ఆసక్తి రేపుతోందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ  భేటీ జరిగిందో లేదో ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ఊహాగానాలకు తెరపడుతుంది. లేకపోతే రకరకాలుగా చర్చలు, ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి. 

Also Read: AP GOs : ఏపీ జీవోలన్నీ టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియలే ! హైకోర్టు విచారణలో వెలుగులోకి కీలక అంశాలు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget