CM Jagan PRC : ఉద్యోగులకు మేలు చేయడానికే పీఆర్సీ నిర్ణయాలు - ఉద్యోగుల సమక్షంలోనే సీఎం జగన్ ప్రకటన !
పీఆర్సీ నిర్ణయాలను ఉద్యోగ నేతల సమక్షంలోనే సీఎం జగన్ ప్రకటించారు. వారంతా చప్పట్లతో ఆహ్వానించారు.
ఉద్యోగులకు వీలైనంత మేలు చేసేందుకు పీఆర్సీ నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు వంటి వాటిపై విస్తృతంగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామన్నారు. 14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు పలుదఫాలుగా చెప్పినాదాదాపుగా తొమ్మిది శాతం ఎక్కువగా ఖరారు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం, సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యమన్నారు.
Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్‌మెంట్ ఇవ్వలేమని. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్నికోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ....అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించామని సీఎం జగన్ తెలిపారు. అధికారుల కమిటీ చెప్పిన 14.29శాతం కన్నా దాదాపు 9శాతం పెంచి ఫిట్‌మెంట్ ఇస్తున్నామని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ. 10,247 కోట్లు రాష్ట్ర ప్రభుతానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని తెలిపారు. మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, అన్నిరకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మీ సేవలన్ని మనం మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో... రిటైర్‌మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నామని ఉద్యోగులకు జగన్ తెలిపారు. 1.1.2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు.
Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జూన్ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈహెచ్‌ఎస్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చానని సీఎం తెలిపారు. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వస్తుందని స్పష్టం చేశారు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించామని... నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ... ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చానని జగన్ తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగాచెల్లించాలని ఆదేశించానని జగన్ తెలిపారు. పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇస్తామన్నారు.
Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి