News
News
X

IAS Pola Bhaskar: టోల్ విషయంలో రగడ... ఐఏఎస్ అధికారి, టోల్ గేట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం... చివరికి...

టోల్ విషయంలో ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్ పోలా భాస్కర్ కి, టోల్ గేట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలా భాస్కర్ వాహనాన్ని టోల్ గేట్ సిబ్బంది అడ్డుకోవడంతో వివాదం నెలకొంది.

FOLLOW US: 

ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్, ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ కి చేదు అనుభవనం ఎదురైంది. కర్నూలు-గుంటూరు రహదారిపై ఉన్న టోల్ గేట్ దగ్గర వివాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్‌, ప్రస్తుత ఏపీ కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్ వాహనాన్ని టోల్‌ గేట్‌ సిబ్బంది అడ్డుకున్నారు. పోలా భాస్కర్ వాహనానికి టోల్ కట్టే విషయంలో టోల్ గేట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. తాను ఐఏఎస్‌ అధికారినని, ఏపీ కాలేజ్ ఎడ్యూకేషన్ కమిషనర్‌గా ఉన్నానని పోలా భాస్కర్‌ టోల్‌ సిబ్బందికి ఆయన తెలిపారు.

Also Read: Fire Accident: కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన ప్లాస్టిక్ సంచుల పరిశ్రమ... రూ.కోట్లలో ఆస్తి నష్టం

వాహనానికి అడ్డంగా...

తన  వాహనానికి టోల్‌గేట్‌ మినహాయింపు ఇవ్వాలని పోలా భాస్కర్ కోరారు. దీనిపై టోల్‌గేట్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గుర్తింపు కార్డు చూపించాలంటూ పోలా భాస్కర్‌తో టోల్ గేట్ సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. దీంతో పోలా భాస్కర్‌ వ్యక్తిగత సిబ్బంది టోల్‌గేట్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ సిబ్బంది పోలా భాస్కర్ వాహనానికి అడ్డంగా నిలబడి ఆయనను కదలకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న త్రిపురాంతకం తహసీల్దార్‌ కిరణ్‌, పోలీసులు టోల్‌గేట్‌ దగ్గరకు చేరుకున్నారు. తర్వాత ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్‌ను అక్కడి నుంచి పంపించేశారు.

Also Read: Ganesh Chaturthi 2021: వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం... నైట్ కర్ఫ్యూ కొనసాగింపు... థర్డ్ వేవ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

తహసీల్దార్ ఆగ్రహం

అనంతరం టోల్‌గేట్‌ సిబ్బందిపై తహసీల్దార్‌ కిరణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వాహనాలను, ఉన్నతాధికారులు ప్రయాణించే వాహనాలను అడ్డుకోవడం సరికాదన్నారు. టోల్ గేట్ సిబ్బంది దురుసుగా వ్యవహరించడాన్ని నిలదీశారు. టోల్‌గేట్‌ దగ్గర వాహనదారులు, ప్రభుత్వ అధికారులతో దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. 

Also Read: KCR Delhi Tour: ఢిల్లీలో ఆ ముగ్గుర్నీ కలిసే యోచనలో కేసీఆర్.. ఆ తర్వాతే హైదరాబాద్‌కు..

Also Read: 8 మందిని మ్యారేజ్ చేసుకుంది.. మరో పెళ్లి చేసుకోబోతుంటే.. భర్తలకు చెమటలు పట్టే ట్విస్ట్ తెలిసింది

Also Read: Crime News: ఏంటమ్మా.. ఇది పద్ధతేనా.. కత్తితో కూరగాయలు కోయమంటే.. అత్తను కోసేశావ్

Published at : 03 Sep 2021 10:05 AM (IST) Tags: AP News AP Latest news Prakasam news Pola bhaskar Toll plaza

సంబంధిత కథనాలు

Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా

Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

లేఖ రాయడం కూడా లోకేష్‌కు చేతకాదు: కాకాణి

లేఖ రాయడం కూడా లోకేష్‌కు చేతకాదు: కాకాణి

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

ఎట్టకేలకు కుదిరిన మహూర్తం-ఈనెల 30న నెల్లూరుకు జగన్

ఎట్టకేలకు కుదిరిన మహూర్తం-ఈనెల 30న నెల్లూరుకు జగన్

టాప్ స్టోరీస్

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !