Fire Accident: కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన ప్లాస్టిక్ సంచుల పరిశ్రమ... రూ.కోట్లలో ఆస్తి నష్టం
కృష్ణా జిల్లా తెంపల్లిలోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్ని మాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెంపల్లి వద్ద ఉన్న ఓ పాలిమర్స్ పరిశ్రమలో మంటలు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ మంటలను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. నల్లటి పొగలను స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారీగా ఆస్తి నష్టం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న పాలిమర్స్ కంపెనీలో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటలకు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఇంకా మంటలు అదుపులోకి రానట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: 8 మందిని మ్యారేజ్ చేసుకుంది.. మరో పెళ్లి చేసుకోబోతుంటే.. భర్తలకు చెమటలు పట్టే ట్విస్ట్ తెలిసింది
అశ్లీల నృత్యాల కేసులో 31 మంది అరెస్టు
కృష్ణా జిల్లా కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో కృష్ణాష్టమి ఊరేగింపులో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. అశ్లీల నృత్యాల కేసుకు సంబంధించి కైకలూరు పోలీసులు 31 మందిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రెండు ట్రాక్టర్లు, టాటా ఏసీ వాహనాలు, ఊరేగింపునకు ఉపయోగించిన డీజే సౌండ్ బాక్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశ్లీల నృత్యాలకు పాల్పడిన ఐదుగురు హిజ్రాలను గుర్తించామని తెలిపారు. పూర్తి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామన్నారు. కైకలూరు పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Also Read: Khammam: ఊరెళ్లిన మహిళ.. ఇంటికొచ్చి తలుపు తీయగానే హడల్! ఏం జరిగిందంటే..
Also Read: Crime News: ఏంటమ్మా.. ఇది పద్ధతేనా.. కత్తితో కూరగాయలు కోయమంటే.. అత్తను కోసేశావ్