By: ABP Desam | Updated at : 03 Sep 2021 08:04 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో తెలియజేసే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం ఏకంగా ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ పరిణామం రెండు కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య అనే 32 ఏళ్ల వ్యక్తి, కృష్ణ వేణి అనే 27 ఏళ్ల మహిళ ఇద్దరూ భార్యాభర్తలు. ఈ భార్యకు అదే కాలనీలో నివసించే పచ్చినీళ్ల ధర్మయ్య అనే 30 ఏళ్ల వ్యక్తితో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇది వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆగస్టు 26న వారిద్దరూ తమ ఇళ్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత భర్త బాలయ్య 27న ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆస్పత్రిలో చేర్పించడంతో అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 29వ తేదీన మృతి చెందాడు.
Also Read: YS Sharmila: నాన్నా.. ఒంటరిదాన్నయ్యా, కన్నీరు ఆగనంటుంది.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్
వీరు ఉండే కాలనీకి చెందిన వజ్రమ్మ అనే మహిళ ఇటీవల వేంసూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లి గురువారమే ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె తన ఇంటి తలుపు తీయగానే కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించి ఉన్నాయి. దీంతో హడలిపోయిన ఆమె వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు విషయం చెప్పడంతో ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్, ఎస్సై నాగరాజు వెళ్లి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు.
శవాలపై ఉన్న బట్టల ఆధారంగా మృత దేహాలు ధర్మయ్య, కృష్ణ వేణిలవని స్థానికులు గుర్తించారు. బాలయ్య, కృష్ణవేణిల మృతితో వారి పిల్లలు చందన్ కుమార్ (10), వెంకట లక్ష్మి (7) దిక్కులేని వారయ్యారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మయ్యకు ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట ప్రాంతానికి చెందిన మహిళతో గతంలోనే పెళ్లి జరిగింది. ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. ఈ భార్యాభర్తలకు ఉన్న పొరపొచ్చాల వల్ల ధర్మయ్య భార్య విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టారు. దీంతో అతను భార్యా పిల్లలకు దూరంగా లంకపల్లిలోనే ఉంటున్నాడు.
Hyderabad News: ఈజీ మనీ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్ - ఎవరో తెలిస్తే షాక్ !
Viveka Murder Case : నిజాలు బయటపడే రోజు దగ్గర్లోనే, సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో విచారణ పూర్తి - దస్తగిరి
Eluru: తల్లీకూతుర్లను ఇంటికి తెచ్చుకున్న ప్రియుడు, ఆమెతో సహజీవనం! విషాదం మిగిల్చిన కరెంటు బిల్లు!
Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?