(Source: ECI/ABP News/ABP Majha)
AP Employees : ఎపీఎన్జీవో కార్యాలయానికి పోలీసు భద్రత - ఉపాధ్యాయులు ముట్టడించే అవకాశం !
ఏపీఎన్జీవో కార్యాలయానికి పోలీసులు భద్రత కల్పించారు. ఉపాధ్యాయులు ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వంతో పీఆర్సీ చర్చలు జరిపి సమ్మె విరమణ చేసిన ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పుడు చిక్కులు వస్తున్నాయి. నలుగురు ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఏర్పాటైన కమిటీలో ఉన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండిశ్రీనివాసరావు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి కుట్రపూరితంగా తమ హక్కులను కూడా ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేయడమే కాదు సొంత ఉద్యమం ప్రారంభించారు.
కొత్త జిల్లాల ప్రకటనతో ఆ నేతల్లో పెరుగుతున్న ఆశలు, ఇంతకీ ఎవరా నేతలు.. అసలు కథేమిటీ !
ఈ క్రమంలో విజయవాడలోని ఎన్జీవో ఆఫీసు ఎదురుగా పెట్టిన ఫ్లెక్సీల్లో బండి శ్రీనివాసరావుతో పాటు శివారెడ్డి అనే మరో ఉద్యోగ నేత ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఎన్జీఒ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ముట్టడించే అవకాశం ఉందంటూ పోలీసులు కు సమాచారం అందింది. దీంతో అప్రమత్తంమైన పోలీసులు.. అదనపు బలగాలను మోహరించారు. ఎపి ఎన్జీఒ భవనం ఉన్న రహదారిని బారికేడ్లతో మూసివేశారు. ఐడెంటి కార్డు ఉంటేనే ఆ వీధిలోకి అనుమతిస్తున్నారు. ఆందోళన చేసేందుకు వస్తే... అరెస్టు చేసేందుకు వాహనాలను సిద్దం చేశారు.
కుమార్తె పెళ్లికార్డులో మెగా బ్రదర్స్ ఫొటోలు, అభిమానానికి మెగాస్టార్ ఫిదా!
అయితే ఎన్జీవో భవనాన్ని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించలేదు. మరో వైపు ఉద్యోగ సంఘ నేతలపై తీవ్ర విమర్శలు వస్తూండటంతో వివరణ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో నలుగురు ఉద్యోగ నేతలపై తీవ్రమైన ఆరోపణలను ఉద్యోగులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో వారు సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉండటంతో తాము ఎందుకు సమ్మె విరమణ ప్రకటన చేశామో చెప్పుకునేందుకు మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టాలనుకున్నారు. కానీ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హాజరు కాలేదు. దీంతో సమావేశం నిర్వహించలేదు.
ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమణ ప్రకటన చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పీఆర్సీ విషయంలో తమకేమాత్రం సంతృప్తి లేదని టీచర్లు బహిరంగంగానే చెబుతున్నారు. వారు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమను ఉమ్మడి పోరాటం పేరుతో మోసం చేశారని ఉపాధ్యాయులు అనుకోవడంతోనే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగు నేతలు తమ సంఘాల్లోని సభ్యుల నుంచీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.