News
News
X

Srikakulam: కుమార్తె పెళ్లికార్డులో మెగా బ్రదర్స్ ఫొటోలు, అభిమానానికి మెగాస్టార్ ఫిదా!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఓ అభిమాని తన కుమార్తెకు ఆశీస్సులు పంపారు. అభిమాని అకౌంట్లో రూ. లక్ష నగదు కూడా వేశారు.

FOLLOW US: 

తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలకు మంచి క్రేజ్ ఉంటుంది. హీరోలను ఫ్యాన్స్ ఎంతగానో అభిమానిస్తారు. ఇంకొందరైతే కుటుంబసభ్యలు కన్నా ఎక్కువగా అభిమానిస్తుంటారు. ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో ఓ అభిమాని తన కూతురు పెళ్లి పత్రికలో చిరంజీవి దంపతులు, నాగేంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రాలు వేయించారు. తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అభిమాని కుమార్తెకు ఆశీస్సులు పంపారు. 

అభిమాని కుమార్తెకు ఆశీస్సులు

అభిమాని కూతురు పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన  గోక కొండలరావు చిరంజీవికి వీరాభిమాని. చిన్నప్పటినుండి  చిరంజీవి అంటే అమితమైన అభిమానం చిరంజీవి అభిమాన సంఘాల సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ అభిమానాన్ని చాటుకునేవారు. తన కుమార్తె పెళ్లి నిశ్చయం కావడంతో పెళ్లి పత్రికలో చిరంజీవి దంపతులు ఫొటోతో పత్రికని ప్రింట్ చేయించారు కొండలరావు. ఎలాగైనా చిరంజీవికి పత్రికను అందజేయాలని అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడును కోరారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించి ఆయన అభిమాని కూతురు పెళ్లికి లక్ష రూపాయలు అకౌంట్లో జమ చేసి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయం తెలిసి కొండలరావు ఆనందం వ్యక్తం చేశారు. అఖిలభారత చిరంజీవి యువత మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందచేశారు. 

ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహణ

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతో ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. ఇటీవల కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ బ్యాంక్ లను ఏర్పాటు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ ఆందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ముందుగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మిగతా జిల్లాల్లో అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజిన్ సిలెండర్లను ప్రత్యేక వాహనంలో జిల్లాలకు తరలించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చారు. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సిలిండర్ల సేకరణలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించారు.

Published at : 08 Feb 2022 09:58 PM (IST) Tags: Megastar Chiranjeevi Srikakulam mega brothers photos in marriage invitation rajam

సంబంధిత కథనాలు

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు ! ఇంటిని తవ్వించేసుకున్నాడు !

Crime News : గజ్జెల శబ్దం - గుప్త నిధులు !  ఇంటిని తవ్వించేసుకున్నాడు !

Ambati Vs Janasena : బపూన్, రంభల రాంబాబు - అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

Ambati Vs Janasena :   బపూన్, రంభల రాంబాబు -  అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

టాప్ స్టోరీస్

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి