అన్వేషించండి

Srkakulam News: శ్రీకాకుళం జిల్లాలో బియ్యం అక్రమ తరలింపుపై చూసీచూడనట్లుగా యంత్రాంగం - మేలుకునేది ఎప్పుడు?

PDS Rice Scam:శ్రీకాకుళం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థపై నిఘా కొరవడింది. పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా పెద్దగా సోదాలు చేయడం లేదు.

PDS Rice Scam in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో  మంత్రి బాధ్యతలు ఎవరు తీసుకుంటే వారికి ఘనంగా సన్మానించడం జిల్లాలో మిల్లర్లకు అనవాయితీ.. మిల్లర్ల సంఘం గత ప్రభుత్వ హాయాంలో వ్యవహరించిన తీరుతో కాస్తా అధికార పార్టీకి దూరమైనప్పటికి మళ్లీ అందులో ఉండే కొందరు ప్రతినిధులే రింగ్ మాష్టర్లవ్వడానికి చక్రం తిప్పుతున్నారు.   పీడీఎఫ్ కుంభకోణంపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

పీడీఎస్ బియ్యం  అక్రమ రవాణాపై దృష్టి సారించని అధికారులు

జిల్లాలో ఎస్సీ కేవీ మహేశ్వర రెడ్డి గంజాయిపై ఉక్కుపాదం మోపిన చందంగా జేసి ఒక్క సారి దృష్టి సారిస్తే జిల్లాలో పీడీఎఫ్ దందా గుట్టు రట్టువుతుంది. తరచుగా జిల్లాలో ఏదో ఒకమూల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండడం సాధారణంగా మారింది. అధికారులు దృష్టి సారిస్తే రేషన్ బియ్యం తరలించే వాహనాలు పట్టుబడతాయనడానికి గతంలో దాడులు చేసి పట్టుకునే వాహనాలే నిదర్శనమే. జిల్లాలో సీవిల్ సప్లై, విజిలెన్స్ అధికారులుఅక్రమ బియ్యం దందాపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలుకోరుతున్నారు. జిల్లాలో కొందరు మిల్లర్లు రేషన్ బియ్యం వ్యాపారంతోనే వారిలావాదేవీలు సాగిస్తున్నారు. ఎప్పుడైన పట్టుకున్న వాహనాల్లో రేషన్ బియ్యంస్వాధీనం చేసుకుని సదరు వాహన డ్రైవర్ లేదా మరో మధ్యవర్తిపైనో కేసులునమోదు చేస్తున్నారు. సాధారణంగానే 6 ఏ కేసులు నమోదు చేసి చేతులుదులుపుకొంటున్నారు. అనంతరం జేసీ కోర్టుకు తిరగడం సాధారణంగామారింది. పట్టుకున్న అక్రమ బియ్యం వెనుకున్న ముఠాపై ఎప్పుడు దృష్టిసారించే పరిస్థితిలేదు. దీంతో బియ్యం అక్రమ రవాణా చేసే మాఫియాకుఅడ్డుకట్ట వేయలేకపోతున్నారనేది జనం మాట. మరోవైపు పౌష్టికాహారంలోవినియోగించే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం కొందరు అక్రమార్కులు పక్కదారిపట్టిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రాఒడిశా సరిహద్దులో బియ్యం పట్టుకన్న తరువాత సైతం ఎక్కడ దాడులు జరిపిన దాఖలాలు లేవు. రాజకీయంగా, వ్యాపారస్తుల మధ్య విభేదాలున్నపుడు ఎవరైన ఫిర్యాదులు చేస్తే విజిలెన్స్ లేక సివిల్ సప్లై అధికారులుపట్టుకున్న సందర్భాలున్నాయే తప్ప ప్రత్యేక నిఘాతో దాడులు చేసి అరికట్టేపరిస్థితి లేకపోవడం గమనార్హం.

సాధారణ తనిఖీల్లోనే పెద్ద ఎత్తున పట్టుబడుతున్న బియ్యం 

జిల్లాలోని ప్రతి నెలా ఇంటింటికీ వచ్చిలబ్దిదారులకు రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.. వీటినిరాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కొంత మంది లబ్దిదారులు ఈ బియ్యం తినేందుకు నిరాకరించడం తో చిల్లరి వ్యాపారులు అటువంటి వారినుంచి కిలో రూ.20 చొప్పున కోనుగోలు చేసి వారు అక్కడ నుంచి మిల్లర్లకు అమ్ముతున్నారనే జిల్లాలో ఎప్పటినుంచే పలువురు చెబుతునే ఉన్నారు. ఈ బియ్యం కాకినాడ, విశాఖ, ఒడిశా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్గో బస్సులో పీడిఎఫ్ బియ్యం తరలిస్తుండగా అధికారులు గతంలో పట్టుకున్న సంఘట నలు పరిశీలిస్తే గత కొన్ని నెలల క్రితం కొత్తూరు మండలం నివగాం గ్రామ సమీపంలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు రూ.14 లక్షల విలువ గల 32 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం తంగివానిపేట గ్రామంలో మాధవరావుకు చెందిన గోడౌన్ నుంచి లారీలో అక్రమంగా చేస్తున్న బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. వీటివిలువ రూ 8.47 లక్షలుగా అప్పట్లో వెల్లడించారు. సరుబుజ్జిలి మండలంలో బోలేరో పికప్ వాహనంలో పీడిఎస్ బియ్యం రవాణా చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 70 బ్యాగులను సీజ్ చేశారు. ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో కోరాడ గొవిందరావు వద్ద అక్రమంగా నిల్వుంచిన 24 బస్తాలు బియ్యం విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఇలా అనేక చోట్ల ఎన్నికల ముందు రేషన్ బియ్యం సీజ్ చేశారు. దీంతో కొద్ది రోజులు అక్రమ వ్యాపారానికి బ్రేక్ పడిన అనంతరం ఎవరు పట్టించుకోకపోవడంతో జిల్లాలో యదేచ్ఛేగా పెద్ద ఎత్తున దందా సాగుతుందని విమర్శలు వస్తున్నాయి

జిల్లాలో అడ్డుకట్ట పడుతుందా?

జిల్లాలో కొందరు మిల్లర్లు దందా అంతా ఇంతా కాదు. గతంలో ఒకానొక సందర్భంగా మిల్లర్లు అక్రమవ్యాపారానికి ముక్కుతాడు వేసేందుకు విద్యుత్ మీటర్ రీడింగ్ లు సైతం నమోదు చేశారు. దీనివలన ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన ధాన్యం లేవీకి విక్రయించడం నిబంధనలు మేరకు బయటమార్కేట్ లో అమ్ముకోవడం నిర్వహిస్తారు. అడ్డగోలు వ్యాపారం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు చెక్ చెప్పవచ్చని భావించారు. ఈ తనిఖీలు కొద్ది రోజుల తరువాత బ్రేక్ పడింది. దీంతో ఎప్పుడు జిల్లాలో మిల్లర్లదే పై చేయని గతంలో జేసిలు బదిలీలే రుజువు చేశాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాలశాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గట్టిగా దృష్టి పెట్టడంతో కాకినాడ పోర్టు నుంచి అక్రమ వ్యాపారం గుట్టురట్టు అయింది. - ప్రభుత్వం ఈ దందాను అడ్డుకట్టవేసినట్టుగా జిల్లాపై దృష్టి సారిస్తే అక్రమ - వ్యాపారం, కొందరు మిల్లర్ల దందాకు చెక్ చెప్పవచ్చని ప్రజలంటున్నారు. - పవన్ కళ్యాణ్, నాదేండ్ల నిర్ణయం పట్ల ప్రజలు, ప్రజాసంఘాలు సైతం హర్షిస్తున్నాయి. ఇక్కడ బియ్యం అక్రమరవాణాకంటే రీసైక్లింగ్ చేసి విక్రయిం చడం మానవ జీవన విధానాం అస్థవ్యస్థమవుతుందాని అందుచేత ఈ అక్రమ - దందాకు చెక్ పడాలంటు స్వచ్చంద సేవా సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. 

అధికారులేమంటున్నారంటే ?

జిల్లాలో బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతుందన్న ఆరోపణలపై డీఎస్వో  జి. సూర్య ప్రకాశరావును ప్రస్తావించగా జిల్లాలో ఎటువంటి దాడులు చేయడంలేదన్నారు. గతంలో ఒడిశా తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. కాకినాడలో జరిగిన ఘటన తరువాత మిల్లులపై నిఘా పెంచారా, జిల్లాలోని ఎగుమతి అవుతున్న సరుకులుపై దృష్టి సారించారా అని ప్రశ్నిస్తే అక్కడ కు అక్రమ రవాణా చాన్స్ ఉండదంటునే తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నా నని తెలిపారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Embed widget