Pawan Kalyan To Sattenapalli : 18న సత్తెనపల్లికి పవన్ కల్యాణ్ - అంబటి రాంబాబుకు జనసేన చెక్ !
18వ తేదీన పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం పంపిణీ చేయనున్నారు.
Pawan Kalyan To Sattenapalli : జనసేన అధినేత ఈ నెల 18న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్‌సీపీ డప్రభుత్వ విధానాలతో రైతులు విసిగిపోయారని సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తామని జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కౌలు రైతు భరోసాయాత్రలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాల్గొని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. గుంటూరు జిల్లాలో 280 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఆ కుటుంబాలకు సాయం చేస్తారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
సత్తెనపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్
గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా పర్యటనకు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని పవన్ కల్యాణ్ ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సత్తెనఆ నియోజకవర్గం నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంత కాలంగా పవన్ పై అంబటి రాంబాబు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. పవన్ పలు సందర్భాల్లో అంబటి గురించి వ్యాఖ్యలు చేసారు. మంత్రి అంబటి మీడియా సమావేశాలు..ట్వీట్ల ద్వారా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు.. రాజకీయంగా విమర్శలు చేయడం కన్నా అంబటి రాంబాబు ఎక్కువగా పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తూంటారు. ఈ కారణంగా పవన్ ఫ్యాన్స్, జనసైనికులు కూడా అంబటి రాంబాబుపై మండి పడుూ ఉంటారు.. ఈ క్రమంలో అంబటి నియోజకవర్గంలో పవన్ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారు. పార్టీల బలం ఉందనుకున్న నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పర్యటనల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలను పిలిపించి మాట్లాడారు. జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని .. త్వరలో ఆ నియోజకవర్గంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఇలాగే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పవన్ కల్యాణ్ పర్యటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సొంత డబ్బులను ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తున్న పవన్ కల్యాణ్
రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందించడం లేదు. ఇలా కౌలు రైతులు వందల్లో ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారిని ఆదుకునేందుకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. సొంత డబ్బులను.. ఇలా సాయం కోసం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ రెండు వందల మందికిపైగా చనపోయిన కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకూ పలు జిల్లాల్లో పూర్తయింది. జనవాణి కార్యక్రమం ద్వారా కూడా పవన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా నియోజకవర్గాల వారీగా నిర్వహించే అవకాశం ఉంది.