Pawan Kalyan : ఈ పోరాటంలో ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు - నర్సాపురంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!
రాజకీయ పోరాటంలో తన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నర్సాపురం వారాహి యాత్రలో ఆయన పాల్గొన్నారు.
Pawan Kalyan : రాజకీయ పోరాటంలో తన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నర్సాపురంలో ఆయన వారాహి యాత్ర సందర్భంగా ప్రసంగించారు. జనం బాగుండాలే జగన్ పోవాలని.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే.. కాపులకు న్యాయం జరగాంటే జగన్ పోవాలన్నారు. అభివృద్ధి కావాలంటే జగన్ పోవాలి జనసేన రావాలన్నారు. ప్రక్షాళన, పరివర్తన కోసమే తాను పోరాటం చేస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ పోరాటంలో నేను బతికుంటానో లేదో తెలియదన్నారు. తాను గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు బాధపడ్డానన్నారు. తాను ఓడిపోయి అవినీతికి పాల్పడేవారు గెలిాచరన్నారు. అంబేద్కర్ ఆశయాలున్న తాను ఎందుకు ఓడిపోయానని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీఎం జగన్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నంచారు. జగన్ హైదరాబాద్‌లో కూర్చుని దందాలు చేసేవారన్నారు.
ఆయుధం అంటే కత్తులు కాదని.. గొంతే ఆయధం కావాలని అభిమానులకు పిలుపునిచ్చారు. పులివెందుల సంస్కృతి నర్సాపురంకు తీసుకు వస్తే కుదరదని హెచ్చరించారు. రౌడీ మూకలను తన్ని తరిమేస్తామని ప్రకటించారు. నర్సాపురం ప్రజలు రౌడీలకు , కత్తులకు భయపడరని స్పష్టం చేశారు. నాలుగేళ్ల కాలంలో ప్రజలకు నరకం చూపించారని కానీ.. బటన్లు నొక్కి సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ నొక్కాల్సిన బటన్లు నొకక్డం లేదని.. అవేంటో తాను చెబుతానన్నారు. పోలవరం పూర్తి చేయాల్సిన బటన్ నొక్కలేదన్నారు. ఉద్యోగాలు భర్త చేయకపోవడం మీరు నొక్కని బటన్ అని సీఎం జగన్ పై మండిపడ్డారు.
పారిశ్రామికంగా ఏపీ వెనుకబడిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయని..యువతకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇవ్వలేకపోతున్నారని.. మండిపడ్డారు. నాలుగేళ్లుగా సీఎం గాల్లో తిరుగుతున్నారని.. జనంలో తిరిగితే తెలుస్తుంది..అతని పాలన ఉందో అని ఎద్దేవాచేశారు. నర్సాపురంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయలేకపోయారన్నారు. జనసేన వ్తే.. అవినీతిని ఊడ్చేస్తామని ప్రకటించారు.
పవన్ కల్యాణ్ తనకు ప్రాణహాని ఉందని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నర్సాపురంలో పులివెందుల సంస్కృతి గురించి మాట్లాడటం వెనుక కీలకమైన కారణం ఉందంటున్నారు. ఇటీవల పులివెందుల నుంచి వచ్చిన పలువురు నర్సాపురం నియోజకవర్గంలో అక్వాతో పాటు ఇతర వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఈ విషయం తెలిసి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.