Tirumala: ఆ మూడు రోజులు తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే
తిరుమలలో నవంబర్ 13, 14, 15న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. టీటీడీ ప్రకటనను విడుదల చేసింది.
తిరుమలలో 13, 14, 15వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశాడు. ఈ మేరకు 12, 13, 14 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోమని టీటీడీ తెలిపింది. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడానికి కారణం ఏంటంటే.. నవంబర్ 14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది.
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో.. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఈ కారణాల దృష్ట్యా.. బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్న కారణంగా.. సీఎం జగన్ ఇప్పటికే.. సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే విషయాన్ని చర్చకు పెట్టాలని నిర్ణయించారు.
తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవెన్యూలోటుపై సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. రేషన్ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు చేస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయించారు.
Also Read: AP Power Politics : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?
Also Read: PapiKondalu: విషాదాన్ని దాటి ప్రారంభమైన పాపికొండల యాత్ర
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి