అన్వేషించండి

ఆ ముగ్గురు సంగతి తేల్చేస్తారా? నెల్లూరు టూర్‌లో చంద్రబాబు ప్లాన్ ఏంటీ?

సార్వత్రిక ఎన్నికలకోసం టీడీపీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్న చంద్రబాబు.. జోన్ల వారీగా ప్రాంతీయ సదస్సులు పెడుతున్నారు. తాజాగా ఆయన నెల్లూరుకు వస్తున్నారు.

ఏ జిల్లా అయితే వైసీపీకి పెట్టనికోట అనుకున్నారో.. ఏ జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన మహామహులు మట్టికరిచారో.. ఇప్పుడు అదే జిల్లా టీడీపీకి బలంగా మారుతోంది. ఏకంగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరమై, టీడీపీకి దగ్గరవుతున్నారు. టీడీపీలో చేరతారా, వారికి టికెట్ ఇస్తారా, వారు గెలుస్తారా అనే విషయం పక్కనపెడితే.. నెల్లూరు జిల్లాలో టీడీపీ బలం పెరిగింది, వైసీపీ బలం తగ్గింది అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు నెల్లూరుకు వస్తున్నారు. జోన్-4 సమావేశంలో ఆయన పాల్గొంటారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

సార్వత్రిక ఎన్నికలకోసం టీడీపీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్న చంద్రబాబు.. జోన్ల వారీగా ప్రాంతీయ సదస్సులు పెడుతున్నారు. తాజాగా ఆయన నెల్లూరుకు వస్తున్నారు. ఈరోజు నెల్లూరులో జోన్-4 సమావేశం జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు తొలిసారి జిల్లాకు వస్తుండటంతో.. నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. 

మీటింగ్ ఎక్కడ..?

నెల్లూరులో నేషనల్ హైవే సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి కాలేజీ గ్రౌండ్ లో జోన్-4 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జోన్‌-4 పరిధిలోని ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నెల్లూరు జిల్లా నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు.. ఇందులో పాల్గొంటారు. 

2500మందితో భారీ కార్యక్రమం..
కీలక నేతలంతా కలసి 2,500 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సదస్సులో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. 

కార్యక్రమం షెడ్యూల్‌.. 
ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోనల్‌ అధ్యక్షుల ప్రసంగాలుంటాయి. టెలిగ్రామ్‌ బాట్‌ ద్వారా సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇస్తారు. ఆర్టీఎస్‌, ఓటరు పరిశీలన, కుటుంబ సాధికార సారధి నియామక ప్రక్రియపైన అవగాహన కల్పిస్తారు. న్యూట్రిఫుల్‌ యాప్‌, సోషల్ మీడియా, వాట్సప్‌ గ్రూపులపై అవగాహన కార్యక్రమం ఉంటుంది. అక్రమ అరెస్టులు, కేసుల్ని ఎలా ఎదుర్కోవాలనేదానిపై శిక్షణ ఇస్తారు. మధ్యాహ్నం 2.40 గంటల నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంశంపై జోనల్‌, పార్లమెంట్‌ వారీగా సమీక్షలు ఉంటాయి. చంద్రబాబు ఉండవల్లినుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరుకు వస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన సదస్సు ప్రాంతానికి చేరుకుంటారని అంచనా. సాయంత్రం ప్రసంగం అనంతరం ఆయన తిరిగి ఉండవల్లి బయలుదేరుతారు. 

జిల్లాలో వైసీపీ సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నేరుగా వారు చంద్రబాబుని కలసి చర్చిస్తారా లేక రహస్య మంతనాలు సాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఈపాటికే టీడీపీలో చేరారు. ఆయన జిల్లా నాయకులతో ఇంకా కలసిపోలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన కూడా జిల్లా టీడీపీ నేతలతో కలసిపోతారని, రూరల్ నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీకోసం కృషి చేస్తారని అంటున్నారు. తమ్ముడిని టీడీపీలోకి పంపించిన శ్రీధర్ రెడ్డి, చంద్రబాబుని కలుస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget