By: ABP Desam | Updated at : 05 Jul 2022 12:12 PM (IST)
కేఎన్ఆర్ స్కూల్‌లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పడిగాపులు
ఏపీవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా బ్యాగులు తగిలించుకుని స్కూళ్లకు బయలుదేరారు. కానీ నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఓ జాతరలా ఉంది. అడ్మిషన్ల కోసం స్టూడెంట్స్ పోటెత్తారు. వారితోపాటు తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. కేఎన్‌ఆర్ హైస్కూల్‌లో ప్రతి ఏడాది స్కూల్స్ రీపెనింగ్ రోజు జరిగే తంతు ఇది. అక్కడ అడ్మిషన్లు దొరకవు. అలాగని పేరెంట్స్ వదిలిపెట్టరు. రాజకీయ నాయకులు, అధికారులనుంచి సిఫార్సులు చేసినా ఫలితం ఉండదు.
ఎందుకీ డిమాండ్..
కేఎన్ఆర్ హై స్కూల్‌లో విద్యాబోధన సూపర్ అనేది ప్రతి విద్యార్థి చెప్పే మాట. క్రమశిక్షణ గురించి చెప్పాల్సిన పనిలేదు. అటు చదువు, ఇటు క్రమశిక్షణ.. ఇలా పిల్లల్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దే స్కూల్స్ ప్రభుత్వ రంగంలో అరుదు. దీంతో కొన్నేళ్లుగా నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ స్కూల్ లో అడ్మిషన్లు దొరకడం గగనం అయిపోయింది. తరగతి గదులకు తగ్గట్టుగానే 500 మంది పిల్లలకు మించి చేర్చుకోకూడదని నిర్ణయించారు స్కూల్ హెడ్మాస్టర్ విజయ్ ప్రకాష్. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లకు రావడం మరింత ఆశ్చర్యంగా ఉందని అంటున్నారాయన. బయటినుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక కేవలం 6వ తరగతిలో మాత్రమే అడ్మిషన్లు ఇస్తున్నామని, దానికి కూడా ప్రతిభ ఆధారంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులతో కేఎన్ఆర్ స్కూల్ ప్రాంగణం కిక్కిరిసింది. ప్రతి ఏడాది స్కూల్స్ రీ ఓపెనింగ్ రోజు ఇక్కడ ఇది మామూలేనంటున్నారు ఉపాధ్యాయులు. ఈ ఏడాది కరోనా తర్వాత ఈ స్థాయిలో పిల్లలు స్కూల్స్ కి రావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు.. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం అక్కడ పడిగాపులు కాస్తున్నారు.
మార్కులు, ర్యాంకులు..
విద్యాబోధన బాగుంటుంది అనే పేరు మాత్రమే కాదు, దానికి తగ్గట్టే ప్రతి ఏడాదీ టెన్త్ క్లాస్ లో కేఎన్ఆర్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపిస్తుంటారు. ఈ ఏడాది టెన్త్ క్లాస్ లో తర్షశ్రీ అనే విద్యార్థిని 590 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది ఏడో తరగతి చదువుతున్న హంసిని ఎన్ఎంఎంఎస్ లో మంచి ర్యాంక్ సాధించడంతో స్కూల్ దగ్గర సంబరాలు జరిగాయి.
ప్రతి ఏడాదీ కేఎన్ఆర్ స్కూల్ విద్యార్థులు మార్కులు, ర్యాంకులతో తమ సత్తా చూపిస్తున్నారు. అందుకే ఈ స్కూల్ అంటే నెల్లూరు నగరంతోపాటు, జిల్లాలో కూడా అంత క్రేజ్. అడ్మిషన్ దొరికితే చాలు అదృష్టంగా భావిస్తుంటారు.
Smallest Indian National Flag: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ నెల్లూరు స్వర్ణకారుడి అద్భుత ప్రతిభ, అతిచిన్న జాతీయ పతాకం
Garbage Tax: చెత్త పన్ను చెల్లించకపోతే చేయూత పథకం కట్, ఆడియోలు వైరల్!
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD
Nellore TDP : నెల్లూరులో రూ.70 కోట్ల భూ కుంభకోణం, కలెక్టర్ పై టీడీపీ సంచలన ఆరోపణలు!
Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్ప్లస్ - ఇక శాంసంగ్కు కష్టమే!
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!
pTron Tangent Duo: రూ.500లోపే వైర్లెస్ ఇయర్ఫోన్స్ - రీసౌండ్ పక్కా!